రౌడీ స్టార్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

విజయ్‌ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ఆశించిన స్థాయిలో అలరించలేక పోయింది.దాంతో ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

 Vijay Devarakonda Movie Latest Update-TeluguStop.com

విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతున్న వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌కు క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న క్రాంతి మాధవ్‌ ఈ చిత్రాన్ని తప్పకుండా కొత్తగా చూపిస్తాడంటూ అంతా అనుకుంటున్నారు.

Telugu Arjunreddy, Vijaykranthi, Vijay Lover-

ఇక ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ రచయితగా కనిపించబోతున్నాడట.ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.ఇప్పటి వచ్చేసిన ఫస్ట్‌లుక్‌ సినిమాపై అంచనాలు పెంచింది.ఇది మరో అర్జున్‌ రెడ్డి రేంజ్‌లో ఉంటుందా అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.ఇక సినిమా విషయంపై ఒక ఆసక్తికర వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే కనిపించని కొత్తగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడట.

Telugu Arjunreddy, Vijaykranthi, Vijay Lover-

ఇక అర్జున్‌ రెడ్డి సినిమాలో ఉన్న రొమాంటిక్‌ సీన్స్‌కు మించి ఈ సినిమాలో సీన్స్‌ ఉంటాయని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.క్రాంతి మాధవ్‌ గత చిత్రాలను చూస్తే అలాంటి సీన్స్‌ ఉంటాయా అనే అనుమానం అయితే కలుగుతుంది.కాని ఇండస్ట్రీలో మాత్రం విజయ్‌ దేవరకొండ బ్రాండ్‌ ఇమేజ్‌కు తగ్గట్లుగా తప్పనిసరి పరిస్థితుల్లో మనోడు అలాంటి సీన్స్‌ పెట్టాడంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.అసలు విషయం ఏంటీ అనేది సినిమా విడుదలైన తర్వాత తెలుస్తుంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube