విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న హీరో సూర్య

టాలీవుడ్ విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు ఒక రేంజ్ లో ఉంది.గత ఏడాది వరుసగా మూడు ఫ్లాప్ లు వచ్చిన కూడా విజయ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు.

 Vijay Devarakonda Movie In Surya Production House, Tollywood, Kollywood, Studio-TeluguStop.com

ఈ నేపధ్యంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అతను చేస్తున్న ఫైటర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాకి కరణ్ జోహార్ సైతం నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

ఇక ఆ తరువాత కూడా విజయ్ దేవరకొండ వరుస సినిమాలు సంతకాలు చేసి ఉన్నాడు.ఫైటర్ తర్వాత బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో కలిసి ఒక సినిమా చేసే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి.

ఇప్పుడు విజయ్ మరో తెలుగు తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

తమిళ స్టార్ హీరో సూర్య తన ప్రొడక్షన్ కంపెనీ స్టూడియో గ్రీన్ పైన విజయ్ దేవరకొండతో ఒక సినిమా నిర్మించే ప్లాన్ చేసినట్లు సమాచారం.

గత కొంతకాలంగా తెలుగులో స్ట్రైట్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.అయితే తక్కువ బడ్జెట్ లో మంచి మార్కెట్ ఉన్న హీరోతో సినిమా చేస్తే వర్క్ అవుట్ అవుతుందని భావించి దానికి విజయ్ దేవరకొండ బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఇటీవల చర్చలు కూడా జరిగాయని సమాచారం.విజయ్ దేవరకొండ కూడా సూర్య ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేయడానికి ఒకే చెప్పాడని, అయితే దర్శకుడు, కథ విషయంపై క్లారిటీ వచ్చాక ముందుకి వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తుంది.

ఓ తమిళ దర్శకుడు విజయ్ తో సినిమా చేయడం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడని, దానిని ఇప్పటికే సూర్య విని ఒకే చెప్పాడని, ఇక విజయ్ కూడా వింటే ఈ కాంబినేషన్ పై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలలో చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube