హిట్ డైరెక్టర్ తో మరొకసారి సినిమా చేయబోతున్న విజయ్ !

టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు.

 Vijay Devarakonda Movie Director Parasuram-TeluguStop.com

లైగర్ సినిమాను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాను పూరీ జగన్నాథ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 Vijay Devarakonda Movie Director Parasuram-హిట్ డైరెక్టర్ తో మరొకసారి సినిమా చేయబోతున్న విజయ్ -Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.ఈ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన వచ్చింది.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా ను సెప్టెంబర్ 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత ఏ సినిమాను ప్రకటించలేదు.తాజాగా విజయ్ తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మరొక సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

Telugu Geetha Govindam, Liger, Mahesh Babu, Parasuram, Rashmika Mandanna, Sarkaru Vaari Paata, Vijay Devarakonda, Vijay Devarakonda Movie Director Parasuram-Latest News - Telugu

విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చి సూపర్ హిట్ అయినా సినిమా గీతా గోవిందం.ఈ సినిమాను పరుశురామ్ డైరెక్ట్ చేసాడు.ఈ సినిమాతో పరశురామ్ సూపర్ హిట్ అందుకుని తర్వాత సినిమాను ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తోనే ‘సర్కారు వారి పాట‘ సినిమా చేస్తున్నాడు.అయితే మళ్ళీ పరుశురామ్ – విజయ్ కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

గీతా గోవిందం సినిమా హిట్ అయినప్పటి నుండి వీరిద్దరూ మంచి సాన్నిహిత్యంగా ఉంటున్నారు.ఈ చనువుతోనే ఈ మధ్య విజయ్ కు స్టోరీ లైన్ వినిపించడంతో విజయ్ కు బాగా నచ్చి ఓకే చెప్పినట్టు సమాచారం.

అంతేకాదు ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుందని కూడా టాక్ నడుస్తుంది.ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

#SarkaruVaari #Liger #Parasuram #Geetha Govindam #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు