అలా చేస్తానని తల్లికి మాట ఇచ్చిన విజయ్ దేవరకొండ!  

Vijay Devarakonda Mother Birthday Celebrations, Vijay Devarakonda Mother ,Madhavi Devarakonda, 50th Birthday Celebrations, Anand, Social media, Viral Video - Telugu @thedeverakonda, 50th Birthday Celebrations, Anand Devarakonda, Madhavi Devarakonda, Social Media, Vijay Devarakonda, Vijay Devarakonda Mother, Viral Video

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న అతి కొద్ది మంది నటుల్లో విజయ్ దేవరకొండ ఒకరు.కెరీర్ మొదట్లో నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించిన విజయ్ కు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని నాని స్నేహితుని పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

TeluguStop.com - Vijay Devarakonda Mother Madhavi Bday Celebrations Video

ఆ తర్వాత విజయ్ హీరోగా నటించిన పెళ్లిచూపులు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దర్శకనిర్మాతల దృష్టి విజయ్ పై పడింది.

అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా సినిమాలతో యూత్ సెన్సేషన్ గా విజయ్ ప్రశంసలు అందుకున్నాడు.

TeluguStop.com - అలా చేస్తానని తల్లికి మాట ఇచ్చిన విజయ్ దేవరకొండ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

విజయ్ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా అతనికి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.విజయ్ వ్యక్తిగత విషయాలకు వస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన దేవరకొండ గోవర్ధనరావు, మాధవి దంపతులు విజయ్ తల్లిదండ్రులు.

నిన్న విజయ్ తల్లి మాధవి దేవరకొండ 50వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.
పుట్టినరోజు వేడుక సందర్భంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా తల్లికి ఒక మాట ఇచ్చాడు.

తల్లి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఒక వీడియోను షేర్ చేసిన వీడియోలో తల్లి క్రికెట్ బ్యాట్ తో షాట్ కొడుతుండగా విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ షాట్ కొడుతున్నట్టుగా ఫోజిచ్చారు.ట్విట్టర్ లో విజయ్ దేవరకొండ తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ జీవితాంతం తల్లిని సంతోషంగా చూసుకుంటానని అన్నారు.
విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.మరోవైపు విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

తక్కువ సమయంలోనే క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండతో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా సిద్ధంగా ఉండటం గమనార్హం.

#Social Media #Viral Video #@TheDeverakonda #50thBirthday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Devarakonda Mother Madhavi Bday Celebrations Video Related Telugu News,Photos/Pics,Images..