అనా పైసలతో సహా లెక్క తేల్చేసిన రౌడీ  

Vijay Devarakonda Middle Class Fund - Telugu Corona Virus, Mcf, Middle Class Fund, Vijay Devarakonda

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి.నిరుపేద జనాల ఆకలి తీర్చేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి, తమవంతు సాయం చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు.

 Vijay Devarakonda Middle Class Fund

కాగా సినిమా రంగానికి చెందిన పేద కార్మికుల ఆకలిని తీర్చేందుకు కూడా పలువురు సినీ ప్రముఖులు ముందుక వస్తున్నారు.ఈ క్రమంలోనే మెగా స్టార్ చిరంజీవి CCC అనే ఫండ్‌ను ఏర్పాటు చేసి సినీ కార్మికులకు అండగా నిలుస్తున్నారు.

అయితే టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా తనవంతు సాయంగా ‘మిడిల్ క్లాస్ ఫండ్’ అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చిన విరాళాలను మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలకు సాయం అందించేందుకు ఉపయోగించినట్లు విజయ్ తెలిపాడు.తాజాగా ఈ ఫండ్ నుండి ఆయనకు వచ్చిన డబ్బు, దానికి సంబంధించిన వివరాల, ఆయన పెట్టిన ఖర్చు వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

అనా పైసలతో సహా లెక్క తేల్చేసిన రౌడీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇప్పటి వరకు 17723 కుటుంబాలకు(58808 మందికి) సాయం చేసినట్లు విజయ్ చెప్పుకొచ్చాడు.535 మంది వాలంటీర్లు ఈ దీని కోసం పనిచేయగా మొత్తం రూ.1.71కోట్ల ఫండ్ ఖర్చు చేసినట్టు, అందులో 8515 మంది విరాళాలు ఇవ్వగా వారిచ్చిన మొత్తం రూ.1.50 కోట్లుగా ఉందని వెల్లడించారు.మొత్తానికి విజయ్ దేవరకొండ ఈ ఫండ్‌కు సంబంధించిన అణాపైసల లెక్క కూడా తెలియజేయడంతో ఆయన తనపై ఎలాంటి తప్పుడు వార్తలు రాకుండా జాగ్రత్త పడ్డాడని సినీ విశ్లేషకులు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test