అందుకే పెళ్లికి దూరంగా ఉన్నానంటున్న విజయ్ దేవరకొండ...  

Tollywood actor vijay devarakonda marriage news - Telugu Vijay Devarakonda Marriage News, Vijay Devarakonda News, Vijay Devarakonda World Famous Lover, World Famous Lover Move News, World Famous Lover Movie Talk

టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ చిత్రంలోని హీరో పాత్ర పోషించిన అటువంటి హీరో విజయ్ దేవరకొండ.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వం వహించాడు.

Tollywood Actor Vijay Devarakonda Marriage News

అయితే ఈ చిత్రం ద్వారా విజయ్ దేవరకొండ అనుకోని విధంగా ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు.ఇక అప్పటి నుంచి విజయ్ దేవరకొండ తన కెరియర్ లో వెనుతిరిగి చూసుకునే అవసరం లేకుండా దూసుకు పోతున్నాడు.

అయితే తాజాగా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటించాడు.ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ప్రమోషన్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా తన పెళ్లి విషయంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విజయ్ దేవరకొండ.ప్రస్తుతం తనకి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదని, పెళ్లి కంటే ముందు చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయని అన్నాడు.

అంతేగాక పెళ్లి అనేది చాలా పవిత్రమైన బంధమని అది ఎవరో చెప్పడం వలన కానీ లేదా ఇతరుల బలవంతం వల్ల గాని ఆ బంధానికి ముడి పడకూడదని అన్నారు.తనకంటూ పెళ్లి చేసుకోవాలి అనిపిస్తే నిరభ్యంతరంగా తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని కూడా తెలిపారు.

అయితే ఇది ఇలా ఉండగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం వాలెంటెన్స్ డే కానుకగా ఈ నెల 14వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదలవుతోంది.ఈ చిత్రంలో కేతరీన్, రాశి ఖన్నా, ఇసాబెల్లా, ఐశ్వర్య రాజేష్ నలుగురు కథానాయకులు విజయ్ దేవరకొండ సరసన నటించారు.దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఈ చిత్రం ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే మరి బాక్సాఫీస్ వద్ద ఈ వరల్డ్ ఫేమస్ లవర్ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tollywood Actor Vijay Devarakonda Marriage News Related Telugu News,Photos/Pics,Images..