నాలుగేళ్ల క్రితం రూ.500 లకే కష్టం.. ఇప్పుడు 50 కోట్లు, ఇలా ఇండస్ట్రీ  

  • ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ఈయన క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో ప్రస్తుతం ఆయన పారితోషికం చూస్తుంటే అర్థం అవుతుంది. అధికారికంగానే విజయ్‌ దేవరకొండ పది కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

  • Vijay Devarakonda Listed In 30 Members List Forbes-Vijay Forbes

    Vijay Devarakonda Listed In 30 Members List In Forbes

  • అనధికారికంగా మరో మూడు నాలుగు కోట్లు అదనంగా ఉండే అవకాశం కూడా ఉంది. అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో ఒక్కసారిగా టాలీవుడ్‌ స్టార్‌ హీరో అయిన విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

  • Vijay Devarakonda Listed In 30 Members List Forbes-Vijay Forbes
  • తాజాగా ఫోర్బ్స్‌ జాబితాలో విజయ్‌ దేవరకొండ చోటు దక్కించుకున్న విషయం తెల్సిందే. తాజాగా ఫోర్బ్స్‌ జాబితాలో విజయ్‌ దేవరకొండ చోటు సంపాదించుకున్న విషయమై స్పందించాడు. తనకు ప్రస్తుతం 29 ఏళ్లు అని, నేను 25వ ఏట అంటే నాలుగు సంవత్సరాల క్రితం తీవ్ర ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొన్నాను. ఆ సమయంలోనే నా ఆంధ్రాబ్యాంకు అకౌంట్‌లో 500 రూపాయలు కూడా లేవు. మినిమం బ్యాలన్స్‌ లేవు అనే ఉద్దేశ్యంతో నా బ్యాంకు ఖాతాను నిలిపేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను.

  • Vijay Devarakonda Listed In 30 Members List Forbes-Vijay Forbes
  • బ్యాంకు అకౌంట్‌ నిలిపి వేసిన సమయంలో మా నాన్న గారు నాతో నీకు 30వ సంవత్సరం వచ్చేప్పటికి ఈ విషయాలను సెటిల్‌ చేసుకోమని సలహా ఇచ్చాడు. అప్పటి నుండి నేను చాలా కష్టపడ్డాను. మరో అయిదు సంవత్సరాల్లో నేను ఎలాగైనా సెట్‌ అవ్వాలనుకున్నాను. కష్టపడ్డంకు ఫలితం దక్కింది. నేను విజయం సాధించాను. తప్పకుండా కష్టపడితే విజయం సాధ్యం అవుతుందని విజయ్‌ దేవరకొండ యూత్‌కు పిలుపునిచ్చాడు.