'లైగర్‌' కోసం టైమ్‌ అడిగిన విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లైగర్.ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది.

 Vijay Devarakonda Liger Shooting Postpone For Pushpaka Vimanam Promotions-TeluguStop.com

గత ఏడాది ఆరంభం లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.కాని కరోనా కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశకు వెళ్లాల్సి ఉంది.ముంబయిలో ఈ సినిమా షూటింగ్ కోసం పూరి అండ్ టీమ్ వెళ్లారు.

 Vijay Devarakonda Liger Shooting Postpone For Pushpaka Vimanam Promotions-లైగర్‌’ కోసం టైమ్‌ అడిగిన విజయ్ దేవరకొండ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని విజయ్ దేవరకొండ మాత్రం ఇంకా జాయిన్ అవ్వలేదు.తాను నిర్మించిన తమ్ముడి సినిమా పుష్పక విమానం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం కాస్త సమయం అడిగినట్లుగా తెలుస్తోంది.

లైగర్ సినిమా చిత్రీకరణ కోసం విజయ్ దేవరకొండ వెళ్లాల్సి ఉండగా పుష్పక విమానం సినిమా ప్రమోషన్స్ వల్ల ఆగిపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Anand Devarakonda, Film News, Liger, Puri Jaganadh, Pushpaka Vimanam, Vijay Devarakonda-Movie

తమ్ముడు ఆనంద్‌ దేవర కొండ కెరీర్‌ విషయంలో విజయ్ చాలా సీరియస్ గా ఉన్నాడు.అందుకే కథ ఎంపిక విషయం నుండి మొదలుకుని ప్రమోషన్స్ వరకు అన్ని కూడా ఆయనే చూసుకుంటున్నాడు.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాను ఈ సమయంలో ఉండాలనే ఉద్దేశ్యంతో పూరిని అడిగి మరీ విజయ్దేవరకొండ ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లైగర్‌ సినిమా చిత్రీకరణ కోసం వచ్చే నెల మొదటి వారంలో విజయ్ దేవరకొండ ముంబయి వెళ్తాడట.లేదంటే నేడో రోపో వెళ్లి మళ్లీ వచ్చే వారం ఆరంభంలో అయినా వస్తాడని తెలుస్తోంది.

మొత్తానికి పుష్పక విమానం కోసం రౌడీ స్టార్‌ కాస్త ఎక్కువ సమయం ను కేటాయిస్తాడని తెలుస్తోంది. దీపావళి సందర్బంగా పుష్పక విమానం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

#Puri Jaganadh #Liger

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube