బ్యూటీతో బైకుపై చెక్కే్స్తున్న రౌడీ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.దీంతో క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో తన నెక్ట్స్ మూవీని పక్కా ప్లానింగ్‌తో తెరకెక్కిస్తున్నాడు విజయ్.

 Vijay Devarakonda Liger Shooting Pic Goes Viral-TeluguStop.com

పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్‌గా కనిపిస్తాడు.ఇప్పటికే షూటింగ్‌తో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ లీకైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

షూటింగ్‌లో భాగంగా విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండేను బైకుపై తీసుకెళ్తున్న ఫోటో ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది.రొమాన్స్‌కు కేరాఫ్‌గా ఉండే పూరి సినిమాలో ఇలాంటి రొమాంటిక్ సీన్లకు కొదువే ఉండదని ఈ ఫోటో చూస్తే ఇట్టే అర్థమవుతోంది.

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో రౌడీ చాలా ఘాటైన రొమాన్స్ చేయనున్నాడని తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో స్పోర్ట్స్ డ్రామాతో పాటు ఎమోషన్స్‌కు కూడా ప్రాముఖ్యత ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లిగా నటిస్తోంది.పూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్‌ అనే పేరుతో ఛార్మి ప్రొడ్యూస్ చేస్తోంది.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా రెడీ అవుతున్నాడు.మరి ఈ సినిమాలో విజయ్-అనన్యల మధ్య ఎలాంటి రొమాన్స్ ఉంటుందో తెలయాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube