అఫీషియల్ : 'లైగర్' టీజర్ విడుదల వాయిదా.. ఎందుకంటే..?

ఈ రోజు మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ పుట్టిన రోజు.ఈ సందర్భంగా విజయ్ నటిస్తున్న లైగర్ సినిమా నుండి టీజర్ రాబోతుందని ఎదురు చుసిన అభిమానులకు ఒక బాడ్ న్యూస్ అందించారు చిత్ర యూనిట్.

 Vijay Devarakonda Liger Movie Teaser Postponed Due To Corona Crisis-TeluguStop.com

టీజర్ విడుదలపై క్లారిటీ ఇచ్చారు.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కుతుంది.

విజయ్ దేవరకొండ కు ఇప్పటికే టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకోవాలని విజయ్ చాలా శ్రమిస్తున్నాడు.

 Vijay Devarakonda Liger Movie Teaser Postponed Due To Corona Crisis-అఫీషియల్ : లైగర్’ టీజర్ విడుదల వాయిదా.. ఎందుకంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పూరీ కూడా అదే టార్గెట్ తో విజయ్ ను కొత్తగా ప్రెసెంట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాడు.రౌడీ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఒక రేంజ్ లో ఉండబోతుందని సమాచారం.

బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా కోసం విజయ్ స్పెయిల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యి విశేష ఆదరణ పొందింది.అయితే ఎప్పటి నుండో ఈ సినిమా నుండి టీజర్ విజయ్ పుట్టిన రోజు కానుకగా విడుదల అవ్వబోతుందని టాక్ నడిచింది.

అయితే ఈ విషయంపై ఈ రోజు అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసారు.

ఈ రోజు టీజర్ విడుదల చేయాలనీ ప్లాన్ చేశామని కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ టీజర్ విడుదల చేయకుండా వాయిదా వేస్తున్నామని తెలిపారు.పరిస్థితులు చక్కబడిన తర్వాత మంచి సమయం చూసి విడుదల చేస్తామని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని విజయ్ దేవరకొండ, ధర్మ ప్రొడక్షన్ వారు అభిమానులను కోరారు.

https://twitter.com/DharmaMovies/status/1391249111500865542/photo/1
#Corona Virus #HappyBirthday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు