రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ల కాంబోలో రూపొందుతున్న సినిమా లైగర్.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది.మరో వారం రోజుల్లో ఆ షెడ్యూల్ ను పూర్తి చేస్తారట.
దాంతో సినిమా కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా జనవరి వరకు ఫస్ట్ కాపీ వచ్చేస్తుంది.
కాని సినిమా విడుదలకు మాత్రం కాస్త సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.ఇప్పటికే జనవరి మరియు ఫిబ్రవరి నెల మొత్తం బుక్ అయ్యింది.
మార్చి నెల పరీక్షలకు వదిలేసి ఏప్రిల్ లో ఈ సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఇటీవలే ఏప్రిల్ 1 వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అదే రోజున మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట ను కూడా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
లైగర్ మరియు సర్కారు వారి పాట సినిమా లు రెండు ఒక్క రోజున వస్తే ఖచ్చితంగా రెండు సినిమా లకు నష్టం ఉంటుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో మీడియా వర్గాల వారు పూరి టీమ్ ను సంప్రదించగా విడుదల తేదీకి సంబంధించిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమే.
ఇప్పటి వరకు మేము షూటింగ్ పైనే దృష్టి పెట్టాం.విడుదల తేదీ విషయంలో త్వరలోనే ఒక స్పస్టత ఇస్తమని పేర్కొన్నారు.ఏప్రిల్ 1 అనేది తాము ఇంకా అధికారికంగా అనుకోలేదని వారు చెబుతున్నారు.
దాంతో మహేష్ బాబుతో పోటీ ఉండటం అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లైగర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
అందుకు తగ్గ డేట్ ను మేకర్స్ ఎంపిక చేయాల్సి ఉంటుంది.అది ఏంటీ అనేది త్వరలో క్లారిటీ వచ్చేయనుంది.