బాబోయ్‌... లైగర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్‌, కుమ్మేశారుగా!

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్‌ దర్శకత్వం లో రూపొందిన లైగర్ సినిమా వచ్చే వారంలో విడుదలకు సిద్ధం గా ఉంది.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న లైగర్ సినిమా వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Vijay Devarakonda Liger Movie Pre Release Business , Vijay Devarakonda , Liger,-TeluguStop.com

సినిమా కు వచ్చిన జబ్‌ నేపథ్యంలో అన్ని ఏరియాలో కూడా భారీ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.సినిమా అన్ని చోట్ల భారీ ఎత్తున విడుదల కాబోతుంది.

రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను రూపొందించారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేయగా.

నాన్ థియేట్రికల్‌ రైట్స్ తో 50 కోట్లకు పైగానే వచ్చే అవకాశం ఉంది.అంటే విడుదలకు ముందే సినిమా నిర్మాతలకు సేఫ్ ప్రాజెక్ట్‌ అవ్వబోతుంది అన్నమాట.

లైగర్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందించామని దర్శకుడు పూరి అంటున్నాడు.

మరి అంచనాలను ఈ సినిమా ఎంత వరకు అందుకుంటుంది అనేది చూడాలి.ఈ సినిమా లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను అనుకుంటే ఆమె డేట్లు లేని కారణంగా అనన్య పాండే ను ఎంపిక చేయాల్సి వచ్చింది అంటూ తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు పూరి చెప్పుకొచ్చాడు.

హీరోగా విజయ్‌ దేవరకొండ కి ఈ సినిమా అత్యంత కీలకం.పూరికి కూడా నిర్మాతగా దర్శకుడిగా ఆయనకు ఈ సినిమా కీలకంగా మారింది. లైగర్‌ సినిమా లో సూపర్ స్టార్‌ ఆర్నాల్డ్‌ ఉండటం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి.అంచనాలకు తగ్గకుండా ఈ సినిమా ను దర్శకుడు పూరి రూపొందించి ఉంటాడు అంటూ ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నారు.

భారీ బ్లాక్ బస్టర్ అయితే తప్ప ఈ సినిమా యొక్క బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రీచ్ అవ్వలేదు.మరి రౌడీ స్టార్‌ కి ఆ స్తాయి విజయం సాధ్యమేనా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube