థాయ్‌లాండ్‌లో సైలెంట్‌గా కానిచ్చేస్తున్న రౌడీ హీరో  

Vijay Devarakonda Learns Mixed Martial Arts In Thailand-janhvi Kapoor,martial Arts,puri Jagannadh,vijay Devarakonda

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం స్క్రిప్టు పనులు కూడా పూర్తి చేశాడు పూరీ.

Vijay Devarakonda Learns Mixed Martial Arts In Thailand-janhvi Kapoor,martial Arts,puri Jagannadh,vijay Devarakonda Telugu Tollywood Movie Cinema Film Latest News-Vijay Devarakonda Learns Mixed Martial Arts In Thailand-Janhvi Kapoor Martial Puri Jagannadh

అయితే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సార్‌గా కనిపించనున్నాడు.

ఫైటర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ థాయ్‌లాండ్‌లో మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రెయినింగ్ కూడా తీసుకుంటున్నాడు.

ఈ ట్రెయినింగ్‌లో భాగంగా ఖచ్చితమైన డైట్‌ను కూడా ఫాలో అవుతున్నాడట రౌడీ హీరో.అతి త్వరలో ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించనున్న పూరీ, ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఒప్పించే పనిలో పడ్డాడట.

విజయ్ కెరీర్‌కు ఫైటర్ చిత్రం బూస్ట్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు సినీ జనం.ఇక పూరీ ఛార్మీతో కలిసి ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.

బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్‌తో కలిసి ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.మరి ఫైటర్ అవతారంలో రౌడీ హీరో ఎలా రెచ్చిపోతాడో చూడాలి.

తాజా వార్తలు

Vijay Devarakonda Learns Mixed Martial Arts In Thailand Related....