వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

 Vijay Devarakonda Kranthi Madav World Famous-TeluguStop.com

ఇక ఇందులో విజయ్ దేవరకొండ కెరియర్ లో మొదటి సారి ముగ్గురు భామలతో రొమాన్స్ చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా విజయ దేవరకొండ స్టైల్ లో నడిచే కథే అనే మాట వినిపిస్తుంది.

ఇక ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

మరో వైపు గత ఏడాది కెరియర్ లో వరుసగా హ్యత్రిక్స్ ఫ్లాప్ సినిమాలు ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ దృష్టి మొత్తం ఇప్పుడు ఈ సినిమా మీదనే ఉంది.

ఈ సినిమాతో సక్సెస్ కొట్టి ఎలా అయిన మరల తన హవాని కొనసాగించాలని దేవరకొండ భావిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన టీజర్ ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

తాజాగా దీనికి సంబదించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు.ఇక ఈ సినిమా టీజర్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.మరి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకులని ఎ మేరకు మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube