వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో, క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మూవీ వరల్డ్ ఫేమస్ లవర్.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

 Vijay Devarakonda Kranthi Madav-TeluguStop.com

ఇక ఈ సినిమాలో విజయ్ కి జోడీగా నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు.ఇక ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది.

ఫిబ్రవరి 6న సాయంత్రం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు.దీనికి సంబందించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాతో విజయ్ కి కచ్చితంగా హిట్ పడాలి.గత సంవత్సరం విజయ్ దేవరకొండ చేసిన మూడు సినిమాలు డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో వరల్డ్ ఫేమస్ లవర్ మీద అతను చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

ఈ నేపధ్యంలో ట్రైలర్ తర్వాత పూర్తి స్థాయిలో ప్రమోషన్ మీద దృష్టిపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఓ వైపు ఫితర్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న విజయ్ ఇక సినిమాతో మరల తన మార్కెట్ స్టామినా పరిచయం చేయాలని అనుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube