విలేజ్ ప్రేమ కథలో విజయ్ దేవరకొండ.. స్టార్ డైరక్టర్ తో మూవీ..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేశారు.

 Vijay Devarakonda Koratala Siva Movie Village Love Story , Tollywood , Viajy Dev-TeluguStop.com

అయితే ఈ సినిమాతో పాటుగా విజయ్ దేవరకొండ స్టార్ డైరక్టర్ కొరటాల శివతో కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది.ఆచార్య తర్వాత ఎన్.

టి.ఆర్ తో సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేస్తాడని టాక్.విలేజ్ లవ్ స్టోరీగా విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

కొరటాల శివ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా అనగానే రౌడీ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి.

సుకుమార్, కొరటాల శివ వరుస స్టార్ డైరక్టర్స్ తో విజయ్ దేవరకొండ క్రేజీ సినిమాలతో తన సత్తా చాటనున్నాడు.ఈ రెండు సీనిమాల తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ డబుల్ అయ్యేలా అవకాశం ఉంటుంది.

లైగర్ తో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్న విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమాను కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేయాలని చూస్తున్నారు.ప్రభాస్, అల్లు అర్జున్ ల తర్వాత విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా ఇమేజ్ పై కన్నేశాడని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube