జూన్ లో ఖుషి రిలీజ్.. సాధ్యమయ్యే పనేనా..!

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఖుషి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ టైటిల్ తో అదే రేంజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా వస్తుంది.

 Vijay Devarakonda Khushi Release Planing In June-TeluguStop.com

ఈ సినిమా స్టార్ట్ చేయడమే ఆలస్యం సమంతకు మయోసైటిస్ వ్యాధి రావడం దాని ట్రీట్ మెంట్ కి సమంత కొద్దిగా గ్యాప్ తీసుకోవడం జరిగింది.ఈ వ్యాధి ట్రీట్ మెంట్ టైం లో సమంత ఎన్నో ఇబ్బందులు పడింది.

ఆ టైం లో రిలీజైన యశోద సినిమా ప్రమోషన్స్ కోసం ఒక స్పెషల్ వీడియో కూడా చేసింది.అయితే ఖుషి కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి కాగా సమంత రాక కోసం టీం అంతా వెయిట్ చేసింది.

ఫైనల్ గా సమంత ఈ మంత్ సెకండ్ వీక్ నుంచి ఖుషి షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తుంది.అంతేకాదు సమంత విజయ్ పోర్షన్ మాత్రమే పెండింగ్ ఉంచి మిగతా సినిమా అంతా దాదాపు పూర్తి చేశారట.

ఇకనుంచి శరవేగంగా షూటింగ్ చేసి ఖుషి సినిమాను జూన్ నెలలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.అయితే జూన్ లో ఖుషి రిలీజ్ సాధ్యమయ్యే పనేనా అంటూ రౌడీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అనుకున్న విధంగా జూన్ లో సినిమా వస్తుందా లేదా అన్నది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube