వైల్డ్ కార్డ్ గా విజయ్ దేవరకొండని వాడతా..!

డైరక్టర్ గా తన టాలెంట్ చూపిస్తున్న యువ దర్శకులలో తరుణ్ భాస్కర్ ఒకరు.డైరక్టర్ గానే కాదు నటుడిగా కూడా తరుణ్ భాస్కర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

 Vijay Devarakonda Is My Wild Card Chance,vijay Devarakonda.tarun Bhaskar,pelli C-TeluguStop.com

ఇక లేటెస్ట్ గా అలితో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తరుణ్ భాస్కర్.ఈ ఇంటర్వ్యూలో భాగంగా విజయ్ దేవరకొండతో సినిమా ఎప్పుడు అన్న ప్రశ్నకి షాకింగ్ ఆన్సర్ఇచ్చారు తరుణ్ భాస్కర్.

విజయ్ దేవరకొండతో సినిమా వైల్డ్ కార్డ్ ఛాన్స్ లాంటిదని వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ అయితే అప్పుడు విజయ్ తో సినిమా ప్లాన్ చేస్తానని అన్నారు తరుణ్ భాస్కర్.

తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో పెళ్లిచూపులు సినిమాతోనే విజయ్ దేవరకొండ హీరోగా ఛాన్స్ దక్కించుకున్నాడు.

ఆ సినిమా హిట్ అవడంతో హీరోగా విజయ్ కి.డైరక్టర్ గా తరుణ్ భాస్కర్ కి మంచి క్రేజ్ వచ్చింది.తరుణ్ భాస్కర్ ఈమధ్య డైరక్షన్ కన్నా యాక్టింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడని తెలుస్తుంది.అయితే తనకు డైరక్షన్ అంటేనే ఇష్టమని త్వరలో ఓ సినిమా అప్డేట్ తో వస్తానని అన్నారు తరుణ్ భాస్కర్.

వెంకటేష్ తో ఓ సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు రాగా ఆ సినిమాపై తరుణ్ భాస్కర్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube