విజయ్‌ దేవరకొండ ఫారిన్‌ గర్ల్‌ ఫ్రెండ్‌.. ఫొటోలు చూస్తే నమ్మాల్సిందే     2018-09-18   10:58:00  IST  Ramesh P

అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో స్టార్‌ డంను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ త్వరలో ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వరుసగా విజయ్‌ దేవరకొండ సూపర్‌ హిట్‌ చిత్రాలతో సూపర్‌ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇలాంటి సమయంలో విజయ్‌ దేవరకొండకు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో విజయ్‌ దేవరకొండ సన్నిహితులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.


విజయ్‌ దేవరకొండ ఒక విదేశీ తెల్లతోలు పిల్లతో చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. విజయ్‌ దేవరకొండతో చాలా క్లోజ్‌గా ఉన్న ఆ అమ్మాయి ఎవరు అంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చర్చకు తెర లేచింది. విజయ్‌ దేవరకొండ లవర్‌ అంటూ కొందరు, మరి కొందరు విజయ్‌ దేవరకొండ స్నేహితురాలు అంటూ మరి కొందరు సోషల్‌ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్‌ చేస్తున్నారు.


తాజాగా ఆ ఫొటోలపై విజయ్‌ దేవరకొండ సన్నిహితులు స్పందిస్తూ.. అర్జున్‌ రెడ్డి చిత్రంకు ముందు విజయ్‌ ఒక షార్ట్‌ ఫిల్మ్‌లో నటించాడు. ఆ షార్ట్‌ ఫిల్మ్‌కు సంబంధించిన ఫొటోలే అవి అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్న కారణంగా ఆ ఫొటోలు ఏంటా అని సాదారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.


ప్రస్తుతం నోటా చిత్రంను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండ త్వరలోనే డియర్‌ కామ్రేడ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండు చిత్రాలపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మంచి కథలతో ఈ చిత్రాలను విజయ్‌ చేసినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు.