జీ మహోత్సవంలో రౌడీ స్టార్‌ పాల్గొన్నందుకు ఎంత తీసుకున్నాడో తెలిస్తే గుండె పట్టేసుకుంటారు  

Vijay Devarakonda In Zee Cinima Awards-vijay Devarakonda,zee Telugu,జీ తెలుగు,విజయ్‌ దేవరకొండ

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌, క్రేజీ హీరో ఎవరు అంటే ఠక్కున అందరు చెప్పే పేర్లలో ముందు ఉండే పేరు విజయ్‌ దేవరకొండ. అవును కేవలం రెండు మూడు సినిమాలతో ఈ క్రేజ్‌ను విజయ్‌ దక్కించుకున్నాడు. రౌడీ స్టార్‌ అంటూ గుర్తింపు దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ బాగా కమర్షియల్‌ అనే విమర్శలు ఉన్నాయి..

జీ మహోత్సవంలో రౌడీ స్టార్‌ పాల్గొన్నందుకు ఎంత తీసుకున్నాడో తెలిస్తే గుండె పట్టేసుకుంటారు-Vijay Devarakonda In Zee Cinima Awards

గతంలో తన సినిమా సక్సెస్‌ అవ్వడంతో ఒక్కసారిగా రేటు పెంచేశాడు అంటూ టాక్‌ వచ్చింది. ఆ విషయం పక్కన పెడితే అంది వచ్చిన యాడ్స్‌ అవకాశాలన్నింటిని కూడా ఒప్పుకుంటున్నాడు.

ప్రస్తుతం అర డజనుకు పైగా యాడ్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విజయ్‌ దేవరకొండ భారీగా డబ్బు సంపాదిస్తున్నాడు.

ఇటీవలే పోర్బ్స్‌ జాబితాలో కూడా స్ధానం దక్కించుకున్నాడు. తాజాగా ఈయన జీ తెలుగు నిర్వహించిన అవార్డు వేడుక ‘జీ మహోత్సవం’లో పాల్గొన్నాడు. దాదాపు గంటన్నర పాటు రష్మిక మందన్నతో కలిసి విజయ్‌ దేవరకొండ ఈ వేడుకలో పాల్గొన్నాడు. సాదారణంగా ఇలాంటి వేడుకలకు పాల్గొనే వారు అతిథులుగా వస్తారు.

అంతే తప్ప డబ్బులు ఆశించి రారు. కాని విజయ్‌ దేవరకొండ మాత్రం ఈ కార్యక్రమంకు డబ్బుల కోసం వచ్చాడట.

ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. కేవలం రెండు గంటల పాటు కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయ్‌ దేవరకొండ జీ వారి నుండి ఏకంగా కోటి రూపాయలకు పైగా వసూళ్లు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ విషయం జీ వారి నుండి అధికారికంగా అయితే ప్రకటన రాకున్నా కూడా మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అంటే అనఫిషియల్‌గా జీ వర్గాల వారు చెబుతున్నారు. మరీ ఇంత కమర్షియల్‌ ఏంటీ బాసూ అంటూ విజయ్‌ దేవరకొండపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.