స్వీటీ సినిమాలో రౌడీ స్టార్.. హీరో కాదట!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది.బాహుబలి చిత్రం తరువాత అమ్మడు సినిమాలను చాలా వరకు నెమ్మదిగా చేస్తోంది.

 Vijay Devarakonda In Anushka Movie, Anushka Shetty, Vijay Devarakonda, Naveen Po-TeluguStop.com

అయితే అనుష్క నటించిన లాస్ట్ మూవీ ‘నిశ్శబ్ధం’ నేరుగా ఓటీటీలో రిలీజ్ కావడంతో, ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.దీంతో ఈసారి ఎలాగైనా అదిరిపోయే హిట్ కొట్టి గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని అనుష్క ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే ఓ కామెడీ జోనర్ మూవీలో నటించేందుకు స్వీటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

జాతిరత్నాలు చిత్రంతో అదిరిపోయే క్రేజ్ సాధించిన నవీన్ పోలిశెట్టితో కలిసి అనుష్క ఓ కామెడీ ఓరియెంటెడ్ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో అనుష్కను మునుపెన్నడూ చూడని విధంగా కామెడీలో రెచ్చిపోనున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాలో అందరినీ సర్‌ప్రైజ్ చేసే అంశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించబోతున్నట్లు తెలుస్తోంది.ఆయన పాత్ర ఈ సినిమాకు చాలా కీలకంగా ఉండబోతుందని టాక్.

అయితే ఆయన చేసేది హీరో పాత్ర మాత్రం కాదట.దీంతో అనుష్క చిత్రంలో విజయ్ దేవరకొండ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాను ‘రారా కృష్ణయ్య’ చిత్ర దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాకు ‘మిస్ శెట్టి.మిస్టర్ పోలిశెట్టి’ అనే ఫన్నీ టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఈ సినిమాతో మరోసారి కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు నవీన్ పోలిశెట్టి రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది.మరి ఈ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తారా, ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube