ఇండస్ట్రీలో రాజకీయాలు, డ్రామాలు చాలా ఎక్కువ.. విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విజయ్ దేవరకొండకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

 Vijay-devarakonda-hot-comments, Vijay Devarakonda, Tollywood, Liger Movie, Hot Comments-TeluguStop.com

పెళ్లిచూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో స్టేటస్ ని సంపాదించుకున్నాడు.ఇక అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ ను క్రియేట్ చేసి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ నీ సంపాదించుకున్నాడు.

ఇకపోతే విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం లైగర్.పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

 Vijay-devarakonda-hot-comments, Vijay Devarakonda, Tollywood, Liger Movie, Hot Comments-ఇండస్ట్రీలో రాజకీయాలు, డ్రామాలు చాలా ఎక్కువ.. విజయ్ దేవరకొండ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ లైక్స్ వచ్చాయి.

ఈ లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు దేవరకొండ.ఇకపోతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో నెపోటిజంపై పరోక్షంగా చేసినవే అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో చాలా రాజకీయాలు నడుస్తున్నాయి అంటూ కీలక వాఖ్యలు చేశాడు.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ.

Telugu Hot, Liger, Tollywood-Latest News - Telugu

కరోనా వల్ల ఇబ్బందులు తలెత్తాయని, అలానే చెప్పలేని ఇన్సిడెంట్స్ కూడా చాలానే జరిగాయని, ఈ సినిమాపై ఎఫెక్ట్ పడే విధంగా చేయాలని కొందరు చాలానే ట్రై చేశారు అని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.ఇండస్ట్రీలో ఇలాంటి డ్రామాలు పాలిటిక్స్ చాలా ఉంటాయి.ఎక్కడికి వెళ్లినా ఈ డ్రామాలు ఉంటాయి.వాళ్లందరికీ వాట్ లాగా దేంగే అనే స్పిరిట్ తో ఈ సినిమాను చేశాను అని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ.ఇకపోతే లైగర్ సినిమా విషయానికి వస్తే.ఈ సినిమా ఆగస్టు 25న వరల్డ్ వైడ్ థియేటర్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే.

దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా హీరోయిన్ ఛార్మి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube