లవ్ స్టోరీపై విజయ్ దేవరకొండ హాట్ కామెంట్.. ఏమిటంటే?

టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న నటుల్లో ఒకరు విజయ్ దేవరకొండ.దానికి తగ్గట్టుగా మంచి ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే మంచి ఫాంలో ఉన్న ఈ స్టార్.అన్ని బిజినెస్‌ల్లోకి అడుగుపెట్టారు.అలా రౌడీ బ్రాండ్‌లతో బట్టల వ్యాపారంలోకి దూకేశాడు.అది బాగానే సక్సెస్ అయిన విషయం తెలిసిందే.

 Vijay Devarakonda Hot Comment On Love Story-TeluguStop.com

ఇదిలా ఉండగా.ఇప్పుడు థియేటర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టేశాడు విజయ్.

ఏసియన్ వాళ్లతో కలిసి మహేష్ బాబు ఏఎంబీ ప్రారంభించినట్టుగా.తాజాగా విజయ్ దేవరకొండ కూడా కొత్త థియేటర్‌ను ఓపెన్ చేశాడు.

 Vijay Devarakonda Hot Comment On Love Story-లవ్ స్టోరీపై విజయ్ దేవరకొండ హాట్ కామెంట్.. ఏమిటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏవీడీ అంటే ఏసియన్ విజయ్ దేవరకొండ.ఈ మల్టీప్లెక్స్‌ను తన సొంత ఊరు మహబూబ్ నగర్‌లో నిర్మిస్తున్నారు.గత ఏడాదిలో ఈ థియేటర్ నిర్మాణ పనులు మొదలయ్యాయి.అయితే కరోనా వల్ల అది ఇంకా ఆలస్యమైంది.

మొదటి సినిమాతోనే మంచి లాభాన్ని పొందేటట్టే ఉన్నాడు విజయ్ దేవరకొండ.నేడు లవ్ స్టోరి సినిమా విడుదల సందర్భంగా.

ఇప్పటికే ఏవీడీని సిద్దం చేశారు.

కాగా ఇప్పటికే మూడు స్క్రీన్లలో లవ్ స్టోరి సినిమా కోసం బుకింగ్స్ ఫుల్ అయ్యాయని, హౌస్ ఫుల్ అంటూ విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.అయితే ఇది విజయ్ దేవరకొండ థియేటర్ అనే క్రేజా? లేక లవ్ స్టోరీ మీదున్న క్రేజా? అన్నది పక్కన పెడితే.కరోనా వల్ల చాలా రోజులు అసలు థియేటర్లే ఓపెన్‌ కాలేదు.

అలాంటిది ఇప్పుడు ఈ సినిమాతో ఇలా హౌస్ ఫుల్ అవుతుండటంతో అందరికీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే నిజంగానే ప్రేక్షకులంతా లవ్ స్టోరీ సినిమాను చూసేందుకు ఎంతో మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

#Naga Chaitanya #Love Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు