'గీత గోవిందం' తర్వాత ఒప్పుకున్న సినిమాలకు 'విజయ్ దేవరకొండ' పారితోషికం భారీగా పెంచేసాడా.?

విజయ్ దేవరకొండ …పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.అర్జున్ రెడ్డిలో తన సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు పొందాడు.

 Vijay Devarakonda Hikes His Remuneration After Geetha Govindam-TeluguStop.com

ప్రస్తుతం గీత గోవిందం హిట్ తో దూసుకుపోతున్న విజయ్ నటించిన “నోటా” ప్రేక్షకుల ముందుకి రానుంది.ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు అనుకుంట.

యూత్ లోనే కాదు ఫామిలీ ఆదిన్స్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు విజయ్.

అయితే అర్జున్ రెడ్డికి ముందు వరకు విజయ్ రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది.ఒక్కసారిగా హిట్ అందుకోవడంతో పారితోషికం బాగా పెంచేసాడు అనే రూమర్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.ఈ హీరో రికార్డు స్థాయి పారితోషికాన్ని తీసుకుంటున్నాడని, గీతగోవిందం తర్వాత ఒప్పుకుంటున్న సినిమాలకు ఇతడి రెమ్యూనరేషన్ భారీగా ఉందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ విషయంపై ఇటీవలే విజయ్ క్లారిటీ ఇచ్చారు.

తను ఎంత తీసుకుంటున్నాడో చెప్పలేదు కానీ.

పారితోషికాన్ని అమాంతం పెంచేసింది మాత్రం లేదన్నాడు.ఏ సినిమాకు ఆ సినిమా ఇదే చివరిది అన్నట్టుగా పని చేస్తాను తప్ప.

ప్లాన్లు వేసుకుని, డబ్బులు డిమాండ్ చేసేదేమీ లేదన్నాడు.ఇక తన పేరు ముందు స్టార్ ట్యాగ్ గురించి కూడా ఈ హీరో స్పందించాడు.

ఏ ట్యాగ్ అయితే బెటరో ప్రేక్షకులే చెప్పాలన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube