తిరిగి ప్రారంభమైన విజయ్ దేవరకొండ 'హీరో' షూటింగ్  

Vijay Devarakonda Hero Movie Is Started - Telugu Hero Movie, Tollywood Box Office, Tollywood Gossips, Vijay Devarakonda

‘ఒక్క ఛాన్స్ దొరికితే చాలు నేనేంటో నిరూపించుకుంటా’ అన్న డైలాగ్ ‘ఖడ్గం’ చిత్రంలో ఎంత ఫెమస్ అయ్యిందో తెలిసిందే.నిజంగా అందరికీ ఒక్క ఛాన్స్ దొరితే వారి టాలెంట్ ఏంటి అనేది బయటపడుతుంది.

Vijay Devarakonda Hero Movie Is Started

అలాంటి ఒక్క చిత్రంతోనే టాలీవుడ్ సెన్సేషనల్ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ.అర్జున్ రెడ్డి చిత్రం తరువాత అతగాడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

అతడితో ఒక్క చిత్రం చేసినా చాలు అన్న రేంజ్ కు నిర్మాతలు దిగొచ్చారు అంటే అతిశయోక్తి కాదు.అలాంటి విజయ్ దేవరకొండ కు సంబంధించి ఒక న్యూస్ ఇటీవల మీడియా లో హల్ చల్ చేస్తుంది.

తిరిగి ప్రారంభమైన విజయ్ దేవరకొండ ‘హీరో’ షూటింగ్-Movie-Telugu Tollywood Photo Image

అదే విజయ్ తో ప్లాన్ చేసిన ఒక భారీ చిత్రం ఆగిపోయింది అని.తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వం లో ‘హీరో’ పేరు తో సినిమా ను ప్రారంభించారు.అయితే బైక్ రేసర్ గా ఈ చిత్రంలో కనిపిస్తున్న విజయ్ పై కొన్ని రేసింగ్ సీన్స్ ను కూడా చిత్రీకరించారు.అయితే ఇప్పుడు తాజాగా ఆ చిత్ర షూటింగ్ ఆగిపోయింది అన్న వార్తలు ఇండస్ట్రీ లో గుప్పు మంటున్నాయి.

ఆ చిత్ర అవుట్ ఫుట్ సంతృప్తి కరంగా లేని కారణంగా నిర్మాతలు తప్పుకున్నారు అంటూ ప్రచారం జరగడం తో విజయ్ కెరీర్ కు గట్టి దెబ్బ పడింది అని అనుకున్నారు.ఇప్పటికే పూరి జగన్నాథ్, దర్శకత్వంలో పూరి,ఛార్మి నిర్మాతలు గా చేస్తున్న మూవీ ఫైటర్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న విషయం తెలిసిందే.‘హీరో’ సినిమా తో పాటు ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు విజయ్‌ దేవరకొండ పై ఇప్పుడు ఈ రూమర్స్ రావడం తో నిజంగానే విజయ్ కు గట్టి ఝలక్ అని అనుకున్నారు.కానీ తాజాగా ఈ సినిమాను తిరిగి ప్రారంభిస్తున్నట్లు సమాచారం.

స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోందట.ఈ సినిమాలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌ హీరోయిన్ గా మన టాలీవుడ్ కు పరిచయం అవ్వబోతుంది.

గతంలోనే భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమాను పక్కన పెట్టడానికి కారణం లేకపోలేదు.విజయ్ దేవరకొండ ఇటీవల నటించి రిలీజ్ అయిన చిత్రం డియర్ కామ్రేడ్.

ఈ చిత్రం విజయ్ సినీ కెరీర్ ఎంత డిజాస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే.

 ఈ కారణంగానే ఈ భారీ బడ్జెట్ చిత్రం ను తెరకెక్కించడం రిస్క్ అని భావించిన నిర్మాతలు పక్కన పెట్టారు అంటూ ప్రచారం జరిగింది.అయితే ఇప్పుడు ఆ వార్తలను తోసిపుచ్చుతూ తాజాగా చిత్ర షూటింగ్ ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి విజయ్ చేతిలో రెండు చిత్రాలు ఉన్నట్లు అర్ధం అవుతుంది.

మరి రెండు గనుక హిట్ లు కొట్టాయి అంటే మాత్రం విజయ్ ఇక వెనక్కి తిరిగి చూసుకొనవసరం లేదు అన్నమాట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Devarakonda Hero Movie Is Started-tollywood Box Office,tollywood Gossips,vijay Devarakonda Related....