విజయ్‌ దేవరకొండ మూవీ ప్రారంభంకు ముందే వివాదంలో... టైటిల్‌ మార్చక తప్పేలా లేదు  

  • విజయ్‌ దేవరకొండ హీరోగా ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో ‘హీరో’ అనే చిత్రంను తాజాగా మైత్రి మూవీస్‌ వారు అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. కేవలం తెలుగులోనే కాకుండా ఈ చిత్రం మొత్తం సౌత్‌ ల్యాంగ్వేజస్‌ అయిన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం మరియు ఉత్తరాది భాష అయిన హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అన్ని భాషల్లో కూడా ఈ చిత్రాన్ని ‘హీరో’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లాలని మైత్రి వారు భావిస్తున్నారు.

  • Vijay Devarakonda Hero Movie Going To Deep Trouble-Hero Hero Vijay Next

    Vijay Devarakonda Hero Movie Going To Deep Trouble

  • బైకర్‌గా ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ కనిపించబోతున్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతుంది. స్పోడ్స్‌ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ చిత్రంను ఎక్కువ శాతం ఢిల్లీలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కాని ఈ చిత్రం టైటిల్‌ వివాదంలో చిక్కుకుంది. యూనిట్‌ సభ్యులు ఏమో అన్ని భాషల్లో కూడా ఈ చిత్రాన్ని హీరో అనే టైటిల్‌తో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే తమిళంలో తాజాగా శివ కార్తికేయన్‌ హీరోగా ‘హీరో’ అనే చిత్రం ప్రారంభం అయ్యింది.

  • Vijay Devarakonda Hero Movie Going To Deep Trouble-Hero Hero Vijay Next
  • విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ అన్నామలైల సినిమా అనౌన్స్‌ అయిన వారం రోజుల గ్యాప్‌లోనే శివకార్తికేయన్‌ మూవీ పట్టాలెక్కిస్తున్నట్లుగా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోను విడుదల చేశారు. దాంతో విజయ్‌ దేవరకొండకు టైటిల్‌ వివాదం తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదట ఈ టైటిల్‌ను ఎవరు రిజిస్ట్రర్‌ చేయించారు అనే విషయాన్ని బట్టి తమిళంలో విజయ్‌ దేవరకొండ టైటిల్‌ ఆధార పడి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తెలుగులో హీరోగా విడుదల చేసి ఇతర భాషల్లో వేరే టైటిల్‌తో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఉద్దేశ్యం ఉంటే ఎలాంటి సమస్య లేదు. కాని అన్ని చోట్ల ఒకే టైటిల్‌ అనుకుంటే మాత్రం ఇది విజయ్‌ దేవరకొండకు పెద్ద ఇబ్బందిగా చెప్పుకోవచ్చు.