సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ డ్రామా ”ఖుషి”.ఈ సినిమాతో ఈ జంట మంచి హిట్ అందుకుంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు.ఈ సినిమాతో విజయ్ మంచి కమ్ బ్యాక్ ఇచ్చి మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
ఇదే ఊపులో మరో రెండు సినిమాలను స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.మరి ఆ సినిమాల్లో గౌతమ్ తిన్ననూరి( Gowtam Naidu Tinnanuri )తో చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటి.
జర్సీ సినిమాతో మంచి హిట్ అందుకున్న గౌతమ్ మరో సినిమాను చేయలేక పోయాడు.సక్సెస్ తర్వాత రామ్ చరణ్ తో ప్రకటించినప్పటికీ ఇది ఆగిపోయింది.

ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఈయన నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు.ఇక ఈ సినిమా ‘‘VD12” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.శ్రీలీల, విజయ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.ఇప్పటికే షూట్ స్టార్ట్ చేసుకుని ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.
అయితే ఈ మధ్య ఈ సినిమా నుండి శ్రీలీల తప్పుకుందని వార్తలు వైరల్ అయ్యాయి.

ఈమె బదులుగా రష్మిక మందన్న హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందనే టాక్ కూడా వచ్చింది.ఈ వార్తలపై తాజాగా నిర్మాత నాగ వంశీ ఒక క్లారిటీ ఇచ్చారు.ఈ సినిమాలో శ్రీలీల మాత్రమే హీరోయిన్( Sree Leela ) గా నటిస్తుందని ఎలాంటి మార్పులు ఇందులో లేవు అంటూ స్పష్టం చేసారు.
విజయ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై సాయి సౌజన్య, నాగ వంశీ గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్నారు.అలాగే అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.