2020 బాలీవుడ్ టార్గెట్ అంటున్న రౌడీ విజయ్ దేవరకొండ  

వచ్చే ఏడాది బాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అని స్పష్టం చేసిన విజయ్ దేవరకొండ. .

Vijay Devarakonda Gives Clarity For Bollywood Entry-dear Comrade,telugu Cinema,tollywood,vijay Devarakonda

టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ హీరో అంటే వెంటనే విజయ దేవరకొండ పేరు అందరూ చెబుతారు. ఒక్కసారిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి తారాజువ్వలా దూసుకొచ్చి వరుస హిట్స్ తో క్రేజీ హీరోగా మారిపోయి, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న హీరో విజయ్ దేవరకొండ. టాలీవుడ్ లో కెరియర్ ఆరంభంలో ఏ హీరో సాధించలేకపోయిన వంద కోట్ల ఫీట్ ని విజయ చాలా ఈజీగా సాధించేసాడు..

2020 బాలీవుడ్ టార్గెట్ అంటున్న రౌడీ విజయ్ దేవరకొండ -Vijay Devarakonda Gives Clarity For Bollywood Entry

అలాగే ఎబ్భై కోట్ల ఫీట్ అయితే ఇక చెప్పక్కర్లేదు. ఇప్పుడు స్టార్ హీరోలతో సమానంగా విజయ్ దేవరకొండ మార్కెట్ ఉంది. దానికి తగ్గట్లుగానే నిర్మాతలు విజయ్ దేవరకొండ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు.

ఇప్పటికే అర డజనుకి పైగా సినిమాలకి కమిట్ అయ్యి ఉన్న విజయ్ దేవరకొండ తెలుగుతో పాటు తమిళంలో కూడా తన క్రేజ్ పెంచుకోవాలనే టార్గెట్ తో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే తన సినిమాలని తెలుగు, తమిళంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. డియర్ కామ్రేడ్ నుంచి నెక్స్ట్ అతను చేస్తున్న సినిమాలు చాల వరకు రెండు భాషలలో తెరకెక్కుతున్నవే.

ఇదిలా ఉంటే తాజాగా ఫోర్బ్స్ లో కూడా స్థానం సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బాలీవుడ్ ని కూడా ఆకర్షించాడు.

బాలీవుడ్ లో చాలా మంది దర్శక నిర్మాతలు విజయ్ దేవరకొండని బాలీవుడ్ కి పరిచయం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. వీరిలో కరణ్ జోహార్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఉండటం విశేషం. అయితే విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది అనే విషయాలకి తాజాగా బాలీవుడ్ మీడియాకి విజయ్ క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా ముంబై వేదికగా జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ వచ్చే సంవత్సరం బాలీవుడ్ ఎంట్రీ ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. బెస్ట్ స్టొరీ కోసం వెయిట్ చేస్తున్న అని రాగానే కచ్చితంగా బాలీవుడ్ లో చేస్తా అని చెప్పుకొచ్చాడు.