దేవరకొండ లక్‌ మామూలుగా లేదుగా... ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ VD కి దక్కింది   దేవరకొండ లక్‌ మామూలుగా లేదుగా… ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ VD కి దక్కింది     2018-12-01   09:48:35  IST  Ramesh P

ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండ లక్‌ మామూుగా లేదు. అస్సలు ఆడదు అనుకున్న ట్యాక్సీవాలా చిత్రం ఏకంగా 30 కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకోవడం కేవలం విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ వల్లే అంటూ విశ్లేషకులతో పాటు సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున విజయాన్ని అందుకున్న అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ బాలీవుడ్‌ వరకు వెళ్లింది. అందుకే తాజాగా కరణ్‌ జోహార్‌ తో కూడా విజయ్‌ దేవరకొండ భేటీ అయినట్లుగా తెలుస్తోంది.

విజయ్‌ దేవరకొండ గురించి తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ షోలో చర్చకు వచ్చింది. ఆ సమయంలో విజయ్‌తో సినిమా చేసే విషయంపై ఆసక్తిగా ఉన్నట్లుగా ప్రకటించిన జాన్వీ కపూర్‌, అతడి యాటిట్యూడ్‌ ఇష్టమంటూ చెప్పుకొచ్చింది. ఇక కరణ్‌ జోహార్‌ కూడా విజయ్‌ దేవకొండ గురించి పాజిటివ్‌ గా మాట్లాడాడు. తాజాగా ఆ విషయాల గురించి విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ కీలక విషయాన్ని పేర్కొన్నాడు. కరణ్‌ జోహార్‌ను తాజాగా ముంబయిలో కలవడం జరిగింది. ఆయనతో వర్క్‌ చేసే రోజు దగ్గర్లో ఉన్నాయంటూ పేర్కొన్నాడు.

Vijay Devarakonda Gets Prabhas Bollywood Project-Karan Johar Karan Movie With Tollywood Hero

బాహుబలి విడుదలైన వెంటనే ప్రభాస్‌తో హిందీలో ఒక చిత్రాన్ని నిర్మించాలని కరణ్‌ జోహార్‌ ప్రయత్నించాడు. కాని ముందే కమిట్‌ అయిన సినిమాలున్న కారణంగా కరణ్‌కు ప్రభాస్‌ ఓకే చెప్పలేదు. దాంతో కరణ్‌ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ను విజయ్‌ దేవరకొండతో చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. తాజాగా ముంబయి వెళ్లిన విజయ్‌ దేవరకొండకు కథ కూడా వినిపించాడట.

Vijay Devarakonda Gets Prabhas Bollywood Project-Karan Johar Karan Movie With Tollywood Hero

విజయ్‌ దేవరకొండ అన్ని అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని, ఆ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. అందుకే విజయ్‌ దేవరకొండ లక్‌ మామూలుగా లేదని సినీ వర్గాల వారు అంటున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.