షూటింగ్‌లో ప్రమాదం... విజయ్‌ దేవరకొండ పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డాడు

యూత్‌లో పిచ్చి క్రేజ్‌ ఉన్న విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కాకినాడలో జరుగుతున్న విషయం తెల్సిందే.

 Vijay Devarakonda Gets Accident At Shooting Spot-TeluguStop.com

ఆ సినిమా చిత్రీకరణ కోసం కొన్ని రిస్కీ షాట్స్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో విజయ్‌ దేవరకొండకు గాయాలు అయ్యాయి.మొదట ఈ వార్తలను అంతా కూడా పుకార్లు అనుకున్నారు.

కాని అనూహ్యంగా విజయ్‌ దేవరకొండ ఈ విషయమై స్పందిచడంతో క్లారిటీ వచ్చింది.

షూటింగ్‌లో గాయపడ్డ మాట వాస్తవమే అని, తన చేతికి అయిన గాయంను కూడా విజయ్‌ దేవరకొండ చూపించాడు.గాయం చిన్నదే అయినా కూడా అదృష్టం కొద్ది పెద్ద ప్రమాదం నుండి విజయ్‌ దేవరకొండ తప్పించుకున్నాడు అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.దర్శకుడు రిస్క్‌ షాట్స్‌ను ప్లాన్‌ చేయడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో మాత్రమే నటిస్తున్నాడు.ఒకసారి ఒకే సినిమాను చేయాలని విజయ్‌ ఫిక్స్‌ అయ్యాడు.అందుకే ఈ చిత్రంకు సంబంధించిన చిత్రీకరణకే మొత్తం సమయం కేటాయిస్తున్నాడు.ఆ తర్వాత క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఈయన సినిమా ఉండే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube