విజయ్‌ దేవరకొండ ఖాతాలో మరో మైలు రాయి వచ్చి చేరింది

టాలీవుడ్‌ లో మరే హీరోకు సాధ్యం కాని అరుదైన రికార్డులను విజయ్‌ దేవరకొండ దక్కించుకుంటున్నాడు.ఇప్పటికే ఈయన యూట్యూబ్‌ లో తన తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్‌ లకు భారీ వ్యూస్ ను దక్కించుకుని రికార్డులు నమోదు చేశాడు.

 Vijay Devarakonda Get One More Instagram Record-TeluguStop.com

ఇప్పుడు ఇన్‌ స్టా గ్రామ్ లో వరసగా రికార్డుల మోత మ్రోగిస్తున్నాడు.రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఇన్‌ స్టాగ్రామ్‌ లో మొన్నటికి మొన్నే 10 మిలియన్ల ఫ్లాలోవర్స్ ను దక్కించుకున్నాడు.

ఇంతలోనే మరో రికార్డును తన ఖాతాలో వేసుకుని ఇతర హీరోలు సైతం కుల్లుకునేలా దూసుకు పోతున్నాడు.

 Vijay Devarakonda Get One More Instagram Record-విజయ్‌ దేవరకొండ ఖాతాలో మరో మైలు రాయి వచ్చి చేరింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా మిలియన్‌ ఫాలోవర్స్‌ ను దక్కించుకున్నాడు.

ఒక్కో యంగ్‌ టాలీవుడ్‌ హీరోలు పది మిలియన్‌ ల మార్క్‌ ను చేరుకునేందుకు కిందా మీదా పడుతున్నారు.ఇప్పటి వరకు వారు అయిదు ఆరు మిలియన్‌ల వద్ద కొట్టుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో డిసెంబర్‌ లో 10 మిలియన్‌ ల మార్క్‌ ను క్రాస్‌ చేసిన రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఇప్పుడు 11 మిలియన్‌ ల మైలు రాయి ని చేరుకున్నాడు.ఇది నిజంగా అద్బుతం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద ఎత్తున ఈయన సినిమా లు చేయడం లేదు.ఉత్తరాదిలో ఇప్పటి వరకు డైరెక్ట్‌ సినిమాలు ఏమీ కూడా ఈయన చేయలేదు.

అయినా కూడా ఈయనకు భారీ ఎత్తున ఫాలోవర్స్ ఉన్నారు.అర్జున్ రెడ్డి తర్వాత బాలీవుడ్‌ లో ఈయనకు అమాంతం అభిమానులు పెరిగారు.

ఇప్పుడు లైగర్‌ సినిమా తో అక్కడ సందడి చేసేందుకు సిద్దం అవుతున్నాడు.విజయ్‌ దేవరకొండ తో లైగర్‌ ను పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్నాడు.

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది.

ఆ తర్వాత శివ నిర్వాన దర్శకత్వంలో ఒక సినిమాను రౌడీ స్టార్‌ చేయబోతున్నాడు.

#Ananya Pande #Instagram #Puri Jaganadh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు