ఎప్పటికైనా అందులో ఒకదాన్ని కొంటాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్?

దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం లైగర్.ప్రస్తుతం విజయ్ దేవరకొండ అమెరికాలో ఉన్నాడు.లైగర్ సినిమా కోసం లాస్ వెగాస్ లో అడుగుపెట్టాడు.మైక్ టైసన్ తో పలు సన్నివేశాలను చిత్రీకరించడానికి పూరి జగన్నాథ్ ప్లాన్ చేశాడు.ఇందులో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హార్స్ రైడింగ్ కూడా చేయబోతున్నాడని అర్థమవుతోంది.

 Vijay Devarakonda Follows Ram Charan Wants To Buy A Horse Details, Vijay Devara-TeluguStop.com

హార్స్ రైడింగ్ అంటే చాలా మందికి పిచ్చి.మన టాలీవుడ్ హీరోలలో చాలా మందికి హార్స్ రైడింగ్ వచ్చు.చిరంజీవి, బాలకృష్ణ వంటి వారికీ హార్స్ రైడింగ్ తెలుసు.ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు చిన్నప్పటి నుంచి హార్స్ రైడింగ్ ఇష్టం అనే విషయం తెలిసిందే.

తన చిన్నతనం నుంచి హార్స్ రైడింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు చెర్రీ.అలా మగధీర సినిమా సమయంలో ఆ సినిమాలో వాడిన గుర్రాన్ని రామ్ చరణ్ సొంతంగా ఉంచుకున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ వద్ద బాద్ షా, కాజల్ వంటి గుర్రాలు ఫామ్ హౌస్ లో ఉన్నాయి.

Telugu Ananya Panday, Horse, Liger, Mike Tyson, Ram Charan, Tollywood-Movie

ఇక హీరో విజయ్ దేవరకొండ కూడా హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టమట.అందువల్లే విజయ్ దేవరకొండ కూడా ఒక గుర్రాన్ని కొనుక్కోవాలని చూస్తున్నాడట.తనకు గుర్రాలు అంటే చాలా ఇష్టమని, త్వరలోనే ఒక గుర్రాన్ని సొంతం చేసుకుంటాను అని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు.

ఇక విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? ఏంటి అన్న విషయాల గురించి ఇంకా ప్రకటించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube