విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) టాలీవుడ్ లోనే సినిమాలతో, వాటి ఫలితాలతో సంబంధం లేకుండా స్టార్డం సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ రౌడీ బాయ్. విజయ్ దేవరకొండకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.
ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ భయంకరంగా ఉంటుంది.అయితే ఆయన తీసే సినిమాల విషయంలో కాస్త ఈ మధ్య ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు.
దాదాపుగా ఆయన నటించిన గత ఆరు సినిమాలో పరాజయం పాలయ్యాయి.అయినా కూడా విజయ్ దేవరకొండ ఏమాత్రం తగ్గలేదు.
సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా కెరియర్ ను ముందుకు తీసుకెళుతున్నాడు.
నిజానికి విజయ్ దేవరకొండకు గీత గోవిందం( Geetha Govindam ) తర్వాత సరైన హిట్టు లేదనే చెప్పాలి.2018లో ఈ సినిమా విడుదల అయ్యింది.దీని తర్వాత నోటా చిత్రం అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.
ఈ సినిమా తర్వాత టాక్సీవాలా( Taxiwala Movie ) విడుదలైనా కూడా ఇది చాలా రోజుల ముందే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల ఆగిపోయి నోటా తర్వాత విడుదల అయ్యింది.ఈ సినిమా పర్వాలేదనిపించుకున్నప్పటికి ఎందుకో భారీ హిట్ అయితే కాదు.గీత గోవిందం హిట్ కాంబినేషన్ అయిన విజయ్ దేవరకొండ రష్మిక మందన మరోమారు డియర్ కామ్రేడ్( Dear Comrade ) అనే సినిమాతో వచ్చిన ఇది కూడా ప్రేక్షకులు అభిమానాన్ని అందుకోలేకపోయింది.2019లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.దీని తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా ఏమాత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోలేదు.
అప్పటికే పాన్ ఇండియా కల్చర్ మొదలు కావడంతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్( Liger ) అనే ఒక పాన్ ఇండియా సబ్జెక్టుతో వచ్చినప్పటికి ఇది కూడా దారుణంగా డిజాస్టర్ ఫలితాన్ని అందించింది.ఈ సినిమా విజయ్ దేవరకొండ లోని మరో నటుడుని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది అనుకుంటే తీవ్ర నిరాశపరిచింది.దీనికోసం చాలానే కష్టపడ్డాడు విజయ్ అయినా ఫలితం శూన్యం.
దీని తర్వాత ఖుషి సినిమా( Khusi Movie ) వచ్చిన అది యావరేజ్ గానే పరవాలేదు అనిపించింది.ఇక తాజాగా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఫ్యామిలీ స్టార్( Family Star Movie ) కూడా దాదాపు డిజాస్టర్ అనే చెప్పొచ్చు.
ఇలా గత ఆరేళ్లుగా విజయం కోసం పరితపిస్తున్నాడు విజయ్ దేవరకొండ.అయినా కూడా అది అందరిని ద్రాక్ష గానే మిగిలిపోయింది.