పేరు మార్చుకుంటున్న ఫైటర్.. కారణం ఏమిటో?  

Vijay Devarakonda Fighter Title Not Yet Confirmed-fighter Movie,karan Johar,puri Jagannadh,vijay Devarakonda

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టాలనుకుంది.

Vijay Devarakonda Fighter Title Not Yet Confirmed-Fighter Movie Karan Johar Puri Jagannadh

తాజాగా ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.

చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీ మరియు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

దీంతో ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.కాగా ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్‌పై బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ సంతోషంగా లేరని తెలుస్తోంది.

బాలీవుడ్ జనాలకు ఆ టైటిల్ అంతగా ఎక్కదని ఆయన భావిస్తున్నాడట.దీంతో ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయలేదు.

అయితే తెలుగు జనాలు ఫైటర్ అనే టైటిల్ సినిమాకు బాగుంటుందని అంటున్నారు.మరి బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ ఆర్డర్ వేస్తే సినిమా టైటిల్ మారడం ఖాయం.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.

తాజా వార్తలు

Vijay Devarakonda Fighter Title Not Yet Confirmed-fighter Movie,karan Johar,puri Jagannadh,vijay Devarakonda Related....