'ఫైటర్‌' ప్రారంభం అయ్యిందా? లేదా?

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఫైటర్‌.ఈ సినిమాలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

 Vijay Devarakonda Fighter Movie Shooting Started Or Not ,vijay Devarakonda, Figh-TeluguStop.com

అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను పూరి భారీ ఎత్తున రూపొందిస్తున్నాడు.తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందుతున్న ఈ సినిమాకు కరణ్‌ జోహార్‌ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రికార్డు స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి అనడంలో సందేహం లేదు.ఎందుకంటే ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా ముంబయిలో జరుగడంతో పాటు పూర్తిగా బాలీవుడ్‌ మూవీగా ఇది రూపొందటంతో విజయ్‌ దేవరకొండ మొదటి హిందీ సినిమా అనే టాక్‌ అయితే వచ్చింది.

దాంతో విజయ్‌ దేవరకొండ మొదటి హిందీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో విజయ్‌ దేవరకొండ అభిమానులను కాస్త నిరుత్సాహ పర్చేలా వ్యవహరిస్తున్నారు.

Telugu Ananya Paday, Ananya Pandey, Charmee Kaur, Charmi, Fighter, Karan Johar,

కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్‌లు అన్ని కూడా మొదలు అయ్యాయి.కాని ఇప్పటి వరకు విజయ్‌ దేవరకొండ ఫైటర్‌ మూవీ మాత్రం ప్రారంభం అయినట్లుగా ఎలాంటి క్లూ కనిపించడం లేదు.కాని షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకుండా ఉండే అవకాశం లేదు.జెట్‌ స్పీడ్‌ లో సినిమాలు చేసే పూరి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తాడు అంటున్నారు.ఇప్పటికే మరో రెండు సినిమాలకు కమిట్‌ అయిన విజయ్‌ దేవరకొండ ఇంకా ఫైటర్‌ ను మొదలు పెట్టకుండా ఉండటం అనేది ఖచ్చితంగా నిజం అయ్యి ఉండదు అంటున్నారు.అందుకే ఈ సినిమా విషయంలో వెంటనే క్లారిటీ ఇవ్వాలంటూ విజయ్‌ మరియు పూరి అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మిని కూడా చాలా మంది షూటింగ్‌ అప్డేట్‌ గురించి అడుగుతున్నారు.వారి ప్రశ్నలకు ఛార్మి సమాధానం దాట వేస్తుంది.

ఎందుకు ఏం జరిగింది అనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.ఇంతకు ఫైటర్‌ ప్రారంభం అయ్యిందా ? లేదా? అనేది పూరినే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube