బాలీవుడ్‌కే ఓటేసిన రౌడీ.. హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మరోసారి బాక్సాఫీస్‌ను దడదడలాడించేందుకు సిద్ధమవుతున్నాడు.

 Vijay Devarakonda Fighter Movie Heroine Finalised-TeluguStop.com

పూరీ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారా అని చాలా ఆతృతగా చూస్తున్నారు ప్రేక్షకులు.

అయితే అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా నటింపజేయాలని చిత్ర యూనిట్ బాగా ప్రయత్నిస్తోంది.కానీ అమ్మడు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటంతో ఆమె విజయ్ దేవరకొండ సినిమాకు నో చెప్పింది.

అయితే ఎలాగైనా బాలీవుడ్‌ బ్యూటీతోనే ఈ సినిమా తెరకెక్కించాలని పూరీ మరియు విజయ్ భావించారు.దీంతో ఈ సినిమాలో హీరోయిన్‌గా అనన్య పాండేను హీరోయిన్‌గా తీసుకున్నారట చిత్ర యూనిట్.

Telugu Ananya Pande, Fighter, Jahnvi Kapoor, Puri Jagannadh, Telugu-

తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ను ముంబయిలో ప్రారంభించారు చిత్ర యూనిట్.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.పూరీ కనెక్ట్స్‌లో ఛార్మీ, పూరీలతో కలిసి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ కూడా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అవుతున్నాడు.మరి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube