రౌడీ స్టార్‌కు మరింతగా పెరుగుతున్న మద్దతు

విజయ్‌ దేవరకొండ లేవనెత్తిన కిల్‌ ఫేక్‌ న్యూస్‌ క్యాంపెయిన్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభించింది.ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు పలువురు ఆయనకు మద్దతు తెలపడంతో పాటు ఈ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.

 Vijay Devarakonda, Corona Crisis, Maa, Kill Fake News Campaign-TeluguStop.com

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్స్‌ అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి.కనుక ఈ విషయమై ముందుకు వెళ్లలేని పరిస్థితి.

కాని ఆయనకు మద్దతుగా మాత్రం కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇప్పటికే నిర్మాతల మండలి ఈ విషయమై స్పందిస్తూ ఎవరైనా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దం అంటూ ప్రకటించారు.

అలాగే ఏ వెబ్‌ సైట్లు అయితే ఫేక్‌ వార్తలు రాస్తుందో వాటికి ఇకపై యాడ్స్‌ ఇవ్వబోము అంటూ ప్రకటించారు.ఇదే సమయంలో ఆ వెబ్‌ సైట్లను బ్యాన్‌ చేయాలని కూడా నిర్మాతల మండలి విజయ్‌ దేవరకొండకు మద్దతుగా మాట్లాడటం జరిగింది.

Telugu Corona-

తాజాగా విజయ్‌ దేవరకొండకు మద్దతుగా మా కూడా నిలిచింది.మా తాత్కాలిక అధ్యక్షుడు బెనర్జీ మాట్లాడుతూ కొన్ని వెబ్‌ సైట్లు రాస్తున్న తప్పుడు వార్తల కారణంగా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులకు గురి అవుతుంది.ఆ రాతలను ఇకపై సహించబోము.విజయ్‌ దేవరకొండ సినీ కార్మికులకు అండగా నిలవడంతో పాటు తన ఛారిటీ ద్వారా చాలా మందికి సాయం చేశారు.అలాంటి వ్యక్తి గురించి విమర్శలు చేయడం దారుణం.వారిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదంటూ మా అధ్యక్షుడు అభిప్రాయ పడ్డాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube