ఇప్పుడైనా పూరిని రౌడీ పట్టించుకుంటాడా?  

Vijay Devarakonda Do Act With Purijaganath Movie-

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ఎట్టకేలకు సక్సెస్‌ కొట్టాడు.ఒకప్పుడు పోకిరి చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న పూరి చాలా కాలంగా చేసిన సినిమా ప్రతి ఒక్కటి బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో ఢీలా పడిపోయాడు.ఎట్టకేలకు ఇస్మార్ట్‌ శంకర్‌తో సక్సెస్‌ను దక్కించుకున్నాడు.ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ అవ్వడంతో పూరి మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లే అంటూ అంతా నమ్ముతున్నారు.

Vijay Devarakonda Do Act With Purijaganath Movie- Telugu Tollywood Movie Cinema Film Latest News Vijay Devarakonda Do Act With Purijaganath Movie--Vijay Devarakonda Do Act With Purijaganath Movie-

ఇక చాలా రోజులుగా రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో సినిమాను చేసేందుకు పూరి ఆశ పడుతున్నాడు.

Vijay Devarakonda Do Act With Purijaganath Movie- Telugu Tollywood Movie Cinema Film Latest News Vijay Devarakonda Do Act With Purijaganath Movie--Vijay Devarakonda Do Act With Purijaganath Movie-

పూరి ప్రస్తుత ఫామ్‌ నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ తప్పించుకుని తిరిగాడు.పూరి అంటే తనకు అభిమానం అంటూనే విజయ్‌ దేవరకొండ ఆమద్య సినిమాకు ప్రస్తుతం ఆసక్తి లేదన్నట్లుగా చెప్పుకొచ్చాడు.పూరి వద్ద విజయ్‌ దేవరకొండకు సరిపోయే ఒక మంచి మాస్‌ మసాలా కథ ఉందట.తప్పకుండా అది రౌడీకి మరింత మంచి మాస్‌ ఇమేజ్‌ను తెచ్చి పెడుతుందట.

అయితే విజయ్‌ దేవరకొండ మాత్రం ఆ కథను వినేందుకు కూడా ఆసక్తిగా లేడని తెలుస్తోంది.

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా సక్సెస్‌ అయిన నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ ఇప్పుడైనా పూరి వద్ద ఉన్న కథను వినేందుకు ఒప్పుకుంటాడో చూడాలి.ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రాన్ని విడుదల చేసే పనిలో ఉన్నాడు.ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం తర్వాత క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో సినిమా ఉంది.ఇలా వరుసగా విజయ్‌ దేవరకొండ కమిట్‌మెంట్స్‌ ఇచ్చాడు.కనుక పూరితో ఎప్పుడు అయ్యేనో చూడాలి.అసలు పూరితో ఇప్పటికైనా రౌడీ కలుస్తాడా అనేది అందరిని వేదిస్తున్న ప్రశ్న.