విజయ్‌ దేవరకొండతో డేట్‌ కోరుకుంటున్న హీరోయిన్‌  

Vijay Devarakonda Dating With Sanusha-sanusha,vijay Devarakonda

పవన్‌ కళ్యాణ్‌ ‘బంగారం’ చిత్రంలో హీరోయిన్‌ చెల్లి పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుంది కదా ఆమె పేరు సానూషా. ఈమె మలయాళం మరియు తమిళంలో దాదాపు 35 సినిమాల వరకు హీరోయిన్‌గా నటించింది. తెలుగులో కూడా ఈమెకు గుర్తింపు ఉంది. ఇటీవలే జర్సీ చిత్రంలో ఈమె జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించింది. పలు డబ్బింగ్‌ సినిమాలతో ఈమె తెలుగు వారికి పరిచయం అయ్యింది..

విజయ్‌ దేవరకొండతో డేట్‌ కోరుకుంటున్న హీరోయిన్‌-Vijay Devarakonda Dating With Sanusha

అలాంటి సానూషా తాజాగా విజయ్‌ దేవరకొండకు ఫ్యాన్‌ను అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్న విజయ్‌ దేవరకొండను కేరళలో సానూషా కలిసింది. విజయ్‌ దేవరకొండకు తాను అభిమానిని అని చెప్పుకున్న సానూషా అతడితో డేటింగ్‌ చేయాలని ఉందంటూ పేర్కొంది. డేట్‌ కు వస్తావా అంటూ విజయ్‌ దేవరకొండను అడిగింది.

అందుకు విజయ్‌ దేవరకొండ తప్పకుండా అంటూ సమాధానం కూడా ఇచ్చాడు. మొత్తానికి ఎంతో మంది లేడీ ఫ్యాన్స్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ సానూషాను కూడా తన బుట్టలో పడేసుకున్నాడన్నమాట..

ఇక విజయ్‌ దేవరకొండ డియర్‌ కామ్రేడ్‌ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళంలో విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రమోషన్స్‌ చాలా ఎగ్రసివ్‌గా చేస్తున్నారు.

గీత గోవిందం చిత్రం తర్వాత రష్మిక మరియు విజయ్‌ దేవరకొండలు కలిసి నటించిన చిత్రం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందేమో చూడాలి.