తమ్ముడి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్న రౌడీ స్టార్‌  

Vijay Devarakonda Cried At Dorasani Pre-release Event-

విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా రూపొందిన ‘దొరసాని’ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక తాజాగా జరిగింది.ఈ వేడుకలో ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ పాల్గొనడం జరిగింది.తమ్ముడి వేడుకలో అన్న పాల్గొనడం చాలా కామన్‌గా చూసే విషయం.కాని ఇప్పటి వరకు తమ్ముడి గురించి ఎలాంటి విషయాన్ని షేర్‌ చేయని విజయ్‌ దేవరకొండ ప్రీ రిలీజ్‌ వేడుకలో చాలా ఎమోషనల్‌గా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Vijay Devarakonda Cried At Dorasani Pre-release Event--Vijay Devarakonda Cried At Dorasani Pre-release Event-

ఆనంద్‌ గురించి విజయ్‌ మాట్లాడుతూ… నేను సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తమ్ముడు అమెరికాలో జాబ్‌ చేస్తూ ఇల్లును చూసుకున్నాడు.కుటుంబంను తన జీతంతో ఆదుకున్నాడు.అటువంటి ఉద్యోగంను వదిలేసి సినిమాల్లో నటించేందుకు వస్తానంటే నాకు నచ్చలేదు.అందుకే మొదట వద్దన్నాను.ఆనంద్‌ సినిమా ఇండస్ట్రీలో ఉండే పరిస్థితులను అర్థం చేసుకునేందుకు నేను అతడికి ఏం సాయం చేయవద్దనుకున్నాను.

Vijay Devarakonda Cried At Dorasani Pre-release Event--Vijay Devarakonda Cried At Dorasani Pre-release Event-

సినిమా ఇండస్ట్రీలో ఉండే ఒడి దొడుకులను ఆనంద్‌ తనంతటగా తానే తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో మొదటి సినిమాకు తన నుండి ఎలాంటి ప్రోత్సాహం అందించలేదని విజయ్‌ దేవరకొండ అన్నాడు.దొరసాని టీజర్‌, ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌ ఇలా ఏ ఒక్కటి కూడా నేను షేర్‌ చేయలేదు.

వాడు సొంతంగా అన్నింటిని సొంతం చేసుకోవాలనే ఉద్దశ్యంతో నేను ఏం చేయలేదని విజయ్‌ దేవరకొండ ఎమోషన్‌ అయ్యి కన్నీరు పెట్టుకున్నాడు.విజయ్‌ దేవరకొండ మాటలు అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు ఒకింత కలచివేశాయి.ఆ తర్వాత మాట్లాడిన జీవిత మరియు రాజశేఖర్‌లు విజయ్‌ దేవరకొండ స్పీచ్‌పై ప్రశంసలు కురిపించారు.