కన్ఫం: వారితో విజయ్ దేవరకొండ నెక్ట్స్ రెండు చిత్రాలు!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ చాలా రఫ్ పాత్రలో నటిస్తున్నాడు.

 Vijay Devarakonda, Fighter, Puri Jagannadh, Dil Raju-TeluguStop.com

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను కూడా చాలా సెలెక్టివ్‌గా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

ఇటీవల సరైన హిట్ లేక సతమతమవుతున్న విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ మూవీని నిన్ను కోరి, మజిలీ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు శివ నిర్వాణ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ మూవీని ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్‌లో చేయనున్నాడు.

ఇప్పటికే ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకున్నాడట.

అయితే ఈ సినిమాకు డైరెక్టర్, చిత్ర టెక్నీషియన్స్, నటీనటులు ఎవరనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఇక ఈ రెండు సినిమాలను తాజాగా విజయ్ దేవరకొండ కన్ఫం చేయడంతో ఆయన నెక్ట్స్ మూవీలు ఏమిటనేది తేలిపోయింది.మరి ఫైటర్ చిత్రం విజయ్ దేవరకొండకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో, ఆ తరువాత విజయ్ చేయబోయే సినిమాలు ఎలాంటి కథలతో వస్తాయో తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube