మీరు వివాదం సృష్టిస్తే నాకే లాభం.. ఇంకో 20 కోట్లు అదనం  

విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంపై ఎంత పెద్ద వివాదం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముద్దులతో పబ్లిసిటీ చేయడంను కాంగ్రెస్‌ నాయకులు తప్పుబట్టారు. అయితే ఆ చిత్రంకు యూత్‌ నుండి మంచి స్పందన దక్కింది. కాంగ్రెస్‌ నాయకుడు విహెచ్‌ చేసిన వివాదం వల్ల సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. అద్బుతమైన రెస్పాన్స్‌ రావడంతో పాటు విజయ్‌ దేవరకొండ స్థాయిని ఆ చిత్రం అమాంతం పెంచేసింది. ఇప్పుడు మరోసారి విజయ్‌ దేవరకొండ మూవీ విషయంలో కాంగ్రెస్‌ నాయకులు రచ్చ చేస్తున్నారు.

Vijay Devarakonda Comments On Congress Leaders-

Vijay Devarakonda Comments On Congress Leaders

నేడు విడుదల కాబోతున్న ‘నోటా’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ చిత్రం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు, ప్రజలను ప్రభావితం చేసే విధంగా ఉంది అంటూ కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉన్న కారణంగా సినిమాను వాయిదా వేయాలని కూడా డిమాండ్‌ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై హైకోర్టులో పిటీషన్‌ కూడా దాఖలు అయ్యింది. ఇలాంటి సమయంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకుల విమర్శలపై స్పందించాడు.

Vijay Devarakonda Comments On Congress Leaders-

‘నోటా’ వివాదం నాకు బాధ కలిగించింది. అయితే వారు ఎంతగా వివాదం చేస్తే నాకు అంత ఎక్కువగా వసూళ్లు వస్తాయని చెప్పుకొచ్చాడు. వారి వివాదం వల్ల కనీసం 20 కోట్ల వసూళ్లు అధనంగా వస్తాయనే నమ్మకంను విజయ్‌ దేవరకొండ వ్యక్తం చేశాడు. నోటా సినిమా విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని, అసలు సినిమాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించిన విషయాలు లేవని చెప్పే ప్రయత్నం చేశాడు.

విజయ్‌ దేవరకొండ ప్రజలు ఎవరు కూడా నోటాను వినియోగించుకోవద్దని, ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుడిని ఎంపిక చేసుకోవాల్సిందిగా కోరాడు. నోటాకు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించగా, జ్ఞానవేల్‌ రాజా నిర్మించాడు. భారీ ఎత్తున ఈ చిత్రంను తెలుగు రాష్ట్రాల్లో మరియు తమిళనాడులో విడుదల చేస్తున్నారు.