'లైగర్' ఓటిటి రూమర్ పై తన మార్క్ పంచ్ విసిరిన రౌడీ !

టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ విజయ్ దేవరకొండ ఒకరి.ఈయనకు యూత్ లో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది.

 Vijay Devarakonda Clarify On Liger Ott Release-TeluguStop.com

విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పూరీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.అదే హుషారుతో లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 Vijay Devarakonda Clarify On Liger Ott Release-లైగర్’ ఓటిటి రూమర్ పై తన మార్క్ పంచ్ విసిరిన రౌడీ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా కోసం విజయ్ బాక్సింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు పూరీ.మొదటిసారి విజయ్ పాన్ ఇండియా స్టార్ గా నటిస్తున్నాడు.

ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకోవాలని రౌడీ అనుకుంటున్నాడు.

ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యి విశేష ఆదరణ పొందింది.ఈ కాంబినేషన్ పై మరిన్ని అంచనాలను పెంచింది.

ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తం గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటె ఈ సినిమాకు ఓటిటి నుండి బంపర్ ఆఫర్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.ఓటిటి ఈ సినిమాకు 200 కోట్లు ఆఫర్ చేసిందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఈ విషయంపై విజయ్ స్పందించారు.ఇది చాలా తక్కువ అంతకు మించి థియేటర్ లో చూపిస్తా నంటూ రౌడీ తనదైన మార్క్ పంచ్ విసిరారు.

దీనితో ఈ సినిమా థియేటర్ లోనే విడుదల అవుతుందని చెప్పకనే చెప్పాడు విజయ్

.

#Puri Jagannadh #Ananya Pandey #Manisharma #Liger #Karan Johar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు