విజయ్‌కు చిరు మద్దతు.. మీలాగే నేను నా కుటుంబం బాధపడినది

టాలీవుడ్‌ యంగ్‌ క్రేజీ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ నిన్న రెండు మూడు వెబ్‌ సైట్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.మమ్ములను విమర్శించడమే మీకు పని అయ్యిందా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

 Megastar Chiranjeevi Support To Vijay Devarakonda Social Media  Video Vijay Deva-TeluguStop.com

మాపై బతుకుతున్న మీరు మమ్ములను విమర్శించడం ఎంతవరకు కరెక్ట్‌ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహంను వ్యక్తం చేస్తూ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం జరిగింది.

విజయ్‌ దేవరకొండ వీడియోకు చాలా మంది మద్దతు తెలిపారు.

నేను నీతో ఉన్నాను అంటూ ఒక హ్యాష్‌ ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో పలువురు సెలబ్రెటీలు విజయ్‌కు తమ మద్దతును తెలియజేశారు.ఈ సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా స్పందించారు.

ట్విట్టర్‌ ద్వారా చిరంజీవి స్పందిస్తూ విజయ్‌ దేవరకొండకు మద్దతు తెలపడమే కాకుండా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Telugu Chiranjeevi, Tollywood-Movie

ట్విట్టర్‌లో చిరంజీవి.డియర్‌ విజయ్‌ దేవరకొండ మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల నీలాగే నేను మరియు నా కుటుంబ సభ్యులు కూడా బాధపడిన సందర్బాలు చాలానే ఉన్నాయి.

నీకు మద్దతుగా నేను నిలుస్తున్నాను.నీవు చేసిన పనిని తప్పకుండా అభినందించాల్సిందే.

నీవు ఈ సమయంలో చేస్తున్న మంచి పనులు నిజంగా అభినందనీయం అంటూ ప్రశంసలు కురిపించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube