వారెవ్వా.. కాంబో అంటే ఇది..!  

Vijay Devarakonda In Chiranjeevi Movie, Vijay Devarakonda, Chiranjeevi, Lucifer Remake, Ram Charan - Telugu Chiranjeevi, Lucifer Remake, Ram Charan, Vijay Devarakonda

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పూరీ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఫైటర్ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Vijay Devarakonda Chiranjeevi Lucifer

ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌ను వాయిదా వేసుకుంది.

అయితే విజయ్ దేవరకొండ త్వరలో ఓ మెగా రీమేక్ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

వారెవ్వా.. కాంబో అంటే ఇది..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన లూసిఫర్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈ సినిమా రీమేక్ హక్కులు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతను యంగ్ డైరెక్టర్ సుజీత్‌కు అప్పగించారు.ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.

అయితే ఈ సినిమలో ఓ కీలక పాత్రలో నటించేందుకు విజయ్ దేవరకొండను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది.ఈ పాత్ర యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో, ఇందులో విజయ్ దేవరకొండ అయితేనే బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్, దీనికోసం ఆయన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు రౌడీ స్టార్ ఒప్పుకుంటాడా లేడా అనేది చూడాలి.

#Lucifer Remake #Chiranjeevi #Ram Charan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Devarakonda Chiranjeevi Lucifer Related Telugu News,Photos/Pics,Images..