ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఫైటర్... స్పీడ్ మీదున్న పూరీ

స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమా అంటే ఎంత స్పీడ్ గా షూటింగ్ కంప్లీట్ అవుతుందో అందరికి తెలిసిందే.సినిమా మీద చాలా స్పష్టంగా ఉండే పూరీ ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఎక్కువగా వేస్ట్ లేకుండా ఎడిటింగ్ వెర్షన్ స్క్రిప్ట్ తో రెడీ అయ్యి షూటింగ్ కి వెళ్ళిపోతాడు.

 Vijay Devarakonda Charmi Purijagannath-TeluguStop.com

ఇక తన హీరో మేకోవర్ అంటా షూటింగ్ కి ముందే ఫినిష్ చేసి క్యారెక్టర్ ని కూడా చెప్పేసి లొకేషన్ కి వెళ్ళిపోతారు.దీంతో షూటింగ్ లో ఎక్కువ టేకులు కూడా లేకుండా చాలా స్పీడ్ గా జరిగిపోతుంది.

ఇదిలా ఉంటే ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టిన పూరీ ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

చార్మీ, కరణ్ జోహార్ ప్రొడ్యూసర్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిపొయింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయినట్లు టాక్ వినిపిస్తుంది.పది రోజుల పాటు ముంబై పరిసరాలలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని దర్శకుడు పూరీ విజయ్ దేవరకొండతో కలిసి ఫినిష్ చేసినట్లు తెలుస్తుంది.

అయితే పూరీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని ఇంత స్పీడ్ గా చేస్తాడు.అలాంటింది పూరీ కెరియర్ లో మొదటి సారి పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా అంతే స్పీడ్ గా షూటింగ్ జరుపుకోవడం చూస్తుంటే నాలుగు నుంచి ఆరు నెలల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube