ఎన్నో సినిమా లు వస్తూ ఉంటాయి.కాని కొన్ని సినిమా లు మాత్రం క్లాసిక్ అంటూ ఉంటారు.
అలాంటి సినిమా ల గురించి మాట్లాడే అర్హత కూడా ఇప్పుడున్న కొందరు ఫిల్మ్ మేకర్స్ కు అర్హత లేదు.కొందరు మాత్రం వాటిని మించే క్లాసిక్ లను తీయగలరు.
కొందరు క్లాసిక్ సినిమా ల టైటిల్స్ ను ఉపయోగించి సక్సెస్ ను దక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.క్లాసిక్ మూవీ ల టైటిల్స్ ను తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు.
చాలా అంచనాలు ఉంటాయి.కనుక ఎక్కువగా పాత సినిమా ల అది కూడా సూపర్ హిట్ సినిమా టైటిల్స్ ను తీసుకునేందుకు మేకర్స్ భయపడుతూ ఉంటారు.
అలాంటిది విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా కు పుష్పక విమానం అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈ విషయమై ప్రస్తుతం సినీ వర్గాల నుండి మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి కూడా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
ఆనంద్ దేవరకొండ మూవీ పుష్పక విమానం అనే టైటిల్ ను పెట్టడంతో పాటు ఈ సినిమా పూర్తి గా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే విధంగా ఉందని అంటున్నారు.ఈ సినిమా కు విజయ్ దేవరకొండ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు.
ఆయన తండ్రి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.కొత్త దర్శకుడు ఈ సినిమా తో పరిచయం కాబోతుండగా సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఈ సినిమా కు ముందు మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా ను ఆనంద్ దేవరకొండ చేసిన విషయం తెల్సిందే.ఇది ఆయన కెరీర్ లో మూడవ సినిమా.
మొదటి సినిమా దొరసాని నిరాశ పర్చగా రెండవ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ పర్వాలేదు అనిపించినా కూడా అది ఓటీటీ ద్వారా రావడం వల్ల చాలా మంది చూడలేక పోయారు.కనుక టెక్నికల్ గా ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా రెండవదే అంటున్నారు.
మరి ఈ క్లాసిక్ టైటిల్ మూవీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.