ఆనంద్‌ దేవరకొండ రెండవ సినిమా వచ్చేస్తోంది

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమా తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే.ఆయన మొదటి సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేక పోవడంతో తదుపరి సినిమాకు కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు.

 Vijay Devarakonda Brother Anand Devarakonda New Film Middle Class Melodies Comin-TeluguStop.com

ఎట్టకేలకు ఆయన మిడిల్ క్లాస్ మెలోడీస్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.వి ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు వినోద్ అనంతోజు దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనుకున్నా చాలా నెలలుగా లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూసే ఉన్నాయి.ఈ నెల 15 నుండి థియేటర్లు ఓపెన్ చేసినా ప్రేక్షకులు వస్తారన్న నమ్మకం లేకపోవడం వల్ల సినిమాను డైరెక్ట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సినిమాకు స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్‌ ప్రమై్‌ వారు కొనుగోలు చేశారు.ఈ సినిమాకు అమెజాన్‌ భారీ మొత్తంను చెల్లించిందంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో అయినా సక్సెస్ దక్కించుకుంటాడా అంటూ రౌడీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరికొందరు అభిమానులు ఆనంద్ దేవరకొండ సినిమా థియేటర్ లో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం వ్యతిరేకిస్తున్నారు.

విజయ్ దేవరకొండ కాస్త శ్రద్ద పెడితే సినిమాను థియేటర్లలో విడుదల చేయించవచ్చు.కాని ఆయన అలా ఆలోచించడం లేదు.తమ్ముడి గురించి కనీసం బాధ్యత లేదా అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.మరి ఈ విమర్శలకు విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలి.

మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ సినిమాలో ఆనంద్‌ దేవరకొండకు జోడీగా జాను ఫేం వర్ష బొల్లమ్మ హీరోయిన్‌ గా నటించింది.వీరిద్దరి జోడీ పోస్టర్‌ లో చాలా బాగుంది.

సినిమాను నవంబర్‌ 20వ తారీకున అమెజాన్‌ లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube