తెలుగులో రౌడి స్టార్ గా తనకంటూ స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ సెట్ చేసుకున్న విజయ్ దేవరకొండ మిగతా భాషల్లో కూడా తన ఇమేజ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.చూస్తుంటే విజయ్ వేశాలన్ని వర్కౌట్ అయ్యేలానే ఉన్నాయి.డియర్ కామ్రేడ్ సినిమాను ఒకేసారి నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా జులై 26న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.అయితే రీసెంట్ గా తమిళ్ లో చేసిన ప్రమోషన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అంతకుముందు కన్నడలో యష్ తో కలిసి సినిమా లెవెల్ ని మరో స్థాయికి తీసుకెళ్లాడు.తెలుగులో ఎలాగు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ డోస్ పెరిగింది.

ఓవర్సీస్ లో కూడా డియర్ కామ్రేడ్ ప్రీమియర్స్ ను గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ తన మార్కెట్ ను సౌత్ లో టాప్ లిస్ట్ లో చేర్చాలని ప్లాన్ చేస్తున్నాడు.
మరి ఈ సినిమా ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి.భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.