‘పుష్ప’ కంటే ఆ సినిమాపైనే ఎక్కువ ఆసక్తిగా ఉన్నారట  

Fans Interested on Vijay Devarakonda and Sukumar Movie, Pushpa, Rowdy Star, Vijay Devarakonda , Sukumar , Social media, audience - Telugu Audience, Fans Interested On Vijay Devarakonda And Sukumar Movie, Pushpa, Pushpa Movie, Rangasthalam, Rowdy Star, Social Media, Sukumar, Telugu Film News, Vijay Devarakonda

రంగస్థలం చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్‌ తన కొత్త సినిమాను ఇప్పటి వరకు విడుదల చేయలేక పోయాడు.దాదాపు మూడు సంవత్సరాలుగా ఆయన రంగస్థలం తర్వాత ఖాళీగా ఉన్నాడు.

TeluguStop.com - Vijay Devarakonda And Sukumar Movie Fans Interest Pushpa

రంగస్థలం విడుదల అయిన వెంటనే మహేష్‌ బాబుతో సినిమాను అనుకున్నాడు.ఆరు నెలలు వెయిట్ చేసిన తర్వాత ఇద్దరి మద్య ఏదో జరిగి ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.

మహేష్ బాబుతో సినిమా క్యాన్సిల్‌ అయిన వెంటనే అల్లు అర్జున్‌ తో పుష్ప సినిమాను ప్రకటించాడు.సినిమా షూటింగ్‌ గత ఏడాదిలోనే ప్రారంభం అవ్వాల్సి ఉండగా వరుసగా ఏదో ఒక కారణం వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

TeluguStop.com - పుష్ప’ కంటే ఆ సినిమాపైనే ఎక్కువ ఆసక్తిగా ఉన్నారట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభించాల్సి ఉండగా కరోనా కారణంగా ఆగిపోయింది.ఆరు నెలలుగా సినిమా షూటింగ్‌ అప్‌ డేట్‌ లేదు.

వచ్చే నెలలో సినిమాను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు.బన్నీతో సినిమా ఇంకా మొదలు పెట్టకుండానే ఈసారి విజయ్‌ దేవరకొండతో సినిమాను సుకుమార్‌ ప్రకటించాడు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు సుకుమార్‌ల కాంబో ఖచ్చితంగా విభిన్నంగా ఉంటుందని అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.పుష్ప సినిమా కంటే కూడా అధికంగా విజయ్‌ దేవరకొండ, సుకుమార్‌ల కాంబో మూవీ కోసం వెయిట్‌ చేస్తున్నాము అంటూ రౌడీ స్టార్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో ఒక సర్వేలో వెళ్లడి అయ్యింది.

సుకుమార్‌, బన్నీల మూవీ ఖచ్చితంగా మాస్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకునేలా ఉంటుంది.కాని విజయ్‌ దేవరకొండతో సుకుమార్‌ ఎలాంటి సినిమాను తీస్తాడు, అసలు రౌడీ స్టార్‌ ఇమేజ్‌కు సుకుమార్‌ తీసే సినిమాలకు ఏమైనా సంబంధం ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ కారణంగానే పుష్ప కంటే ఎక్కువగా విజయ్‌, సుక్కుల మూవీ కోసం వెయిట్‌ చేస్తున్నట్లుగా కొందరు సుకుమార్‌ అభిమానులు పేర్కొన్నారు.

#FansInterested #Audience #Rowdy Star #Social Media #Rangasthalam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Devarakonda And Sukumar Movie Fans Interest Pushpa Related Telugu News,Photos/Pics,Images..